Rajasthan elections 2023: మియో వర్సెస్‌ ‘రక్షక్‌’

Rajasthan elections 2023: Voters have different reactions to Congress and BJP - Sakshi

రాజస్థాన్ లోని ఆళ్వార్ లో మతపరమైన చీలిక

కాంగ్రెస్, బీజేపీ లపై ఓటర్లలో భిన్న స్పందన

రాజస్తాన్‌లోని ఆళ్వార్‌ జిల్లా ఆవుల స్మగ్లింగ్, సంబంధిత హింసాకాండతో గతంలో చాలాసార్లు వార్తల్లో నిలిచింది. మత ఘర్షణలు కూడా అక్కడ పరిపాటి. ఈ నేపథ్యంలో ఆవులను కాపాడేందుకు అక్కడ కొన్నేళ్లుగా గో రక్షకులు కూడా తెరపైకి రావడంతో పరిస్థితి కాస్తా ముదురు పాకాన పడింది. స్థానిక మియో ముస్లింలు ఆవులను లక్ష్యంగా చేసుకున్నారన్నది వారి ఆరోపణ.

కానీ ఆవుల స్మగ్లింగ్, వధతో తమకు ఎలాంటి సంబంధమూ లేదని ముస్లింలు వాదిస్తున్నారు. నవంబర్‌ 25న రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీల పట్ల వారిలో భిన్న స్పందన వ్యక్తమవుతోంది. నిత్యం తమపై బురదజల్లడం బీజేపీ నైజమని మియో ముస్లింలు ఆవేదన వ్యక్తం చేస్తుండగా కమలం పారీ్టయే రాష్ట్రానికి ఆశా కిరణమన్నది గో రక్షకుల అభిప్రాయంగా కని్పస్తోంది.  

బీజేపీ అలా.. కాంగ్రెస్‌ ఇలా...!
మియో ముస్లింలకు ప్రధానంగా పశు పోషణే జీవనాధారం. అభివృద్ధి, మెరుగైన ఉపాధి లభిస్తే తప్ప తమ జీవితాల్లో మార్పు రాబోదన్న నిశి్చతాభిప్రాయం వారి మాటల్లో ప్రతిఫలిస్తోంది. ఈ ముస్లిం ప్రాబల్య గ్రామాలు చాలావరకు వెనకబడే ఉన్నాయి. రోడ్ల వంటి మౌలిక వసతులు, స్కూళ్లు తదితర సదుపాయాలకు దూరంగా ఉండిపోయాయి. బీజేపీ నిత్యం తమను దోషుల్లా చిత్రిస్తుందన్నది వారి ప్రధాన ఆవేదన.

‘‘అందుకే మా జీవితాలను ఎంతో కొతం మెరుగు పరుస్తుందని పోయిన ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేశాం. కానీ ఐదేళ్లయినా ఏ మార్పూ లేదు’’ అంటూ మొహమ్మద్‌ రఫీక్‌ వాపోయాడు. ‘‘ఓ 30 ఏళ్ల క్రితం దాకా మతపరమైన సమస్యలేవీ పెద్దగా ఉండేవి కాదు. హిందువులు, మేం కలసిమెలసి బతికేవాళ్లం. కానీ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం మొదలయ్యాక పరిస్థితులు బాగు చేయలేనంతగా పాడయ్యాయి’’ అని అన్సారీ అనే వృద్ధుడు ఆవేదన వెలిబుచ్చాడు.

గూండాలన్నా పట్టించుకోం!
ఇక గో రక్షకుల వాదన మరోలా ఉంది. సనాతన ధర్మంలో గోవును మాతగా పూజించడం సంప్రదాయం. వాటికి అవమానం, ప్రాణాపాయం జరిగితే ఊరుకునేది లేదు’’ అని ఒక గో రక్షక్‌ స్పష్టం చేశారు. ‘‘నేను ఎనిమిదేళ్లుగా గో రక్షక్‌గా ఉంటున్నా. మాపై దొంగలు, బందిపోట్లు అని ముద్ర వేశారు. గూండాలని కూడా నిందిస్తున్నారు. అయినా దేనికీ భయపడేది లేదు’’ అని చెప్పుకొచ్చారు.

‘‘ఆవుల స్మగ్లర్లు పోలీసుల సమక్షంలోనే మాపై దాడులకు దిగుతున్నా అడ్డుకునే దిక్కు లేదు. ఎప్పుడు ఏ కారును ఆపినా ఆవుల కళేబరాలే కని్పస్తున్నాయి. మేమెలా సహించేది?’’ అని ప్రశ్నించారాయన. ముస్లిం సంతుïÙ్టకరణతో కూడిన పేరు గొప్ప సోదరభావం తమకు అక్కర్లేదని మరో గో రక్షక్‌ స్పష్టం చేశారు. మత రాజకీయాలు ‘వారికి’ అలవాటేనని ఆరోపించారు. పరిస్థితిని చక్కదిద్దాలంటే బీజేపీ రావాల్సిందేనని అభిప్రాయపడ్డారు.

కాంగ్రెస్‌పై అసంతృప్తి
అయితే కులమతాలతో నిమిత్తం లేకుండా ఆళ్వార్‌ ప్రజల్లో చాలామంది కాంగ్రెస్‌ పాలన పట్ల పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా తమ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలూ జరగలేదన్నది వారి ప్రధాన ఆరోపణ. కాంగ్రెస్‌ నేతల మాటలు చేతల్లో ఎక్కడా కని్పంచలేదని వారు వాపోతున్నారు. ‘‘అందుకే కాంగ్రెస్‌కు మరోసారి ఓటేయాలని లేదు. అలాగని చూస్తూ చూస్తూ మమ్మల్ని అడుగడుగునా అనుమానించి అవమానిస్తున్న బీజేపీకి ఓటేయలేం. మా పరిస్థితి అయోమయంగానే ఉంది’’ అని స్థానిక ముస్లిం యువకుడొకరు చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఈసారి మియో ముస్లింలు ఎవరికి ఓటేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. 

 – సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top