మూడోసారీ మోదీనే ప్రధాని: అయోధ్య ప్రధాన పూజారి | Prediction of Chief Priest of Ram Temple Regarding PM Modi | Sakshi
Sakshi News home page

మూడోసారీ మోదీనే ప్రధాని: అయోధ్య ప్రధాన పూజారి

Jun 3 2024 2:14 PM | Updated on Jun 3 2024 2:14 PM

Prediction of Chief Priest of Ram Temple Regarding PM Modi

లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి అఖండ విజయాన్ని ఆపాదించాయి. అయితే జూన్ 4న ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో, ఏ ప్రభుత్వం ఏర్పాటు కానున్నదో తెలిసిపోనుంది. అన్ని ప్రాంతాలలో మాదిరిగానే అయోధ్యలో కూడా లోక్‌సభ ఎన్నికలపై చర్చలు జరుగుతున్నాయి.

ప్రధాని మోదీ మూడోసారి ప్రధాని కావాలని కోరుకుంటూ రామాలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ ప్రతిరోజూ బాలరాముని ముందు వేడుకుంటున్నారు. ఈ నేపధ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పూర్తి మెజారిటీతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవుతుందని, మూడోసారి  కూడా మోదీ ప్రధాని కాబోతున్నారని జోస్యం చెప్పారు.

మోదీ మూడోసారి దేశానికి ప్రధాని అవుతారని తాను గతంలోనే చెప్పానని సత్యేంద్ర దాస్ తెలిపారు. తాను చెప్పినది జూన్‌ 4న రుజువుకానున్నదని అన్నారు. దేశ ప్రధాని మోదీకి రామ్‌లల్లా ఆశీస్సులు ఉన్నాయని, ఆయన ప్రజలకిచ్చిన హామీలను నెరవేరుస్తారని దాస్‌ పేర్కొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement