
అవినీతిపరుడైన చంద్రబాబుకు జేపీ మద్ధతివ్వడం సిగ్గుచేటు. 2014-2019 మధ్య చంద్రబాబు ఏం అభివృద్ధి చేశాడు.
సాక్షి, గుంటూరు: జయప్రకాశ్ నారాయణపై ఎఫ్‌డీసీ చైర్మన్ పోసాని కృష్ణ మురళి ఫైర్ అయ్యారు. సీఎం జగన్ పాలనలో జరిగిన అభివృద్ధి జేపీకి కనిపించటం లేదా? అని సూటిగా ప్రశ్నించారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు.
‘మేధావి ముసుగు వేసుకున్న జేపీని ప్రజలు నమ్మొద్దు. తమ కులానికి చెందన వాడు కాబట్టే చంద్రబాబుకు జేపీ మద్ధతు. అవినీతిపరుడైన చంద్రబాబుకు జేపీ మద్ధతివ్వడం సిగ్గుచేటు. 2014-2019 మధ్య చంద్రబాబు ఏం అభివృద్ధి చేశాడు. చంద్రబాబు పాలనలో టీడీపీ నేతలు దోచుకున్నారు.
వంగవీటి రంగాను చంపిన వ్యక్తి చంద్రబాబు. చంద్రబాబును మళ్లీ సీఎం చేస్తే రాష్ట్రం నాశనమే. కమ్మకులానికి చెందిన వాడైనా వెధవలకు నేను సపోర్ట్ చేయను. ఎన్నికల ముందు జేపీ చేత చంద్రబాబు ఆడిస్తున్న డ్రామా ఇది. బాబు మోసాలను గమనించే సీఎం జగన్‌కు ప్రజలు 151 సీట్లు ఇచ్చారు’ అని పోసాని తెలిపారు.