అక్కడ ఒక్క సీటు కూడా ఓడిపోం: ప్రధాని మోదీ | PM Modi says We Wont Lose Any single Seat in Bihar | Sakshi
Sakshi News home page

అక్కడ ఒక్క సీటు కూడా ఓడిపోం: ప్రధాని మోదీ

May 13 2024 9:48 AM | Updated on May 13 2024 11:48 AM

PM Modi says We Wont Lose Any single Seat in Bihar

పట్నా: బిహార్‌లో గత పార్లమెంట్ ఎన్నికల కంటే మెరుగైన ఫలితాలను సాధిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రధాని మోదీ ఓ జాతీయమీడియాతో మాట్లాడారు.

‘‘బిహార్‌లో మా మిత్ర పక్షాలతో  మాట్లాడాను. మేము గత 2019 లోక్‌సభ ఎన్నికల్లో బిహార్‌ ఒక్క సీటులో ఓడిపోయాం. ఈసారి  ఓడిపోయిన ఆ ఒక్క సీటులోను విజయం సాధిస్తాం. బిహార్‌ రాష్ట్ర ప్రజలతో నాకు బలమైన అనుబంధం ఉంది. సంస్థాగత పనులపై బిహార్‌లో ప్రాంతాల్లో పర్యటించాను. బిహార్‌ ప్రాంతం,  ఇక్కడి ప్రజలతో చాలా మంచి అనుబంధం ఉంది.

దేశంలోని అ​న్ని రాష్ట్రాల్లో బీజేపీ, ఎన్డీయే కూటిమి పార్టీలు అధిక సంఖ్యలో గెలిచి.. 400 స్థానాల లక్ష్యాన్ని చేరుకుంటాం. ఈ కొత్త సంకల్పంతో బిహార్‌ రంగులతో ఉంది. దానికి బలాన్ని చేకూరుస్తోంది. దేశ వ్యాప్తంగా ఉ‍న్న సానుకూల వాతావరణ బిహార్‌లో అద్దం పడుతోంది’’ అని ప్రధాని మోదీ అన్నారు.

40 ఎంపీ సీట్లు ఉన్న బిహార్‌లో బీజేపీ కూటమి మొత్తం 39 సిట్లను గెలుచకుంది. ఒక్కసీటును కాంగ్రెస్‌-ఆర్జేడీ కూటమి గెలుపొందింది.

Advertisement
 
Advertisement
Advertisement