మన్మోహన్ సింగ్‌పై ప్రధాని మోదీ ప్రసంశలు | Sakshi
Sakshi News home page

మన్మోహన్ సింగ్‌పై ప్రధాని మోదీ ప్రసంశలు

Published Thu, Feb 8 2024 11:44 AM

PM Modi Praises Former PM Manmohan Singh - Sakshi

ఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌పై ప్రధాని మోదీ ప్రసంశలు కురిపించారు. వీల్ చైర్‌లో కూడా వచ్చి పనిచేశారని పేర్కొన్నారు. రాజ్యసభలో పదవీ విరమణ చేస్తున్న సభ్యుల వీడ్కోలు సందర్భంగా సభలో ప్రసంగిస్తూ ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఓటింగ్ సమయంలో ట్రెజరీ బెంచ్ గెలుస్తుందని తెలిసినా.. మన్మోహన్ సింగ్ వీల్ చైర్‌లో వచ్చి ఓటేశారని ప్రధాని మోదీ గుర్తు చేశారు. సభ్యుడు తన విధుల పట్ల అప్రమత్తంగా ఉంటాడనడానికి ఇదొక ఉదాహరణ అని కొనియాడారు.

పదవీ విరమణ చేయనున్న రాజ్యసభ సభ్యులకు ఢిల్లీలోని చైర్మన్ జగదీప్ ధన్‌ఖర్ నివాసంలో గురువారం వీడ్కోలు ఇవ్వనున్నారు. ఈమేరకు ఇవాళ ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో రాజ్యసభ సభ్యులు గ్రూప్ ఫోటోలో పాల్గొన్నారు. అనంతరం సాయంత్రం 6.30 గంటలకు చైర్మన్ నివాసంలో పదవీ విరమణ చేస్తున్న సభ్యులకు వీడ్కోలు కార్యక్రమంలో పాల్గొంటారు.

ఇదీ చదవండి: కాశీ, అయోధ్య.. ఇక మథుర: యోగి

Advertisement
Advertisement