AP Former Minister Perni Nani Comments On Chandrababu Over 2024 Elections, Details Inside - Sakshi
Sakshi News home page

Perni Nani: 2024 తర్వాత చంద్రబాబుకు అదే పరిస్థితి

Dec 2 2022 12:20 PM | Updated on Dec 2 2022 4:26 PM

Perni Nani Comments On Chandrababu - Sakshi

తనకు ఇవే చివరి ఎన్నికలని చంద్రబాబు అంటున్నారని, బాబుతో ఇదే కర్మ అంటూ జనం అంటున్నారని పేర్ని నాని ఎద్దేవా చేశారు.

సాక్షి, అమరావతి: రామోజీరావు ఎన్ని జాకీలు పెట్టి లేపినా బాబు లేచే పరిస్థితి లేదని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తనకు ఇవే చివరి ఎన్నికలని చంద్రబాబు అంటున్నారని, బాబుతో ఇదే కర్మ అంటూ జనం అంటున్నారని పేర్ని నాని ఎద్దేవా చేశారు. బయట ధరలు ఎలా ఉన్నాయి. హెరిటేజ్‌లో ఎంత ఉన్నాయి?. రామోజీ అమ్మే ప్రియ ఆయిల్స్‌ రేట్లు ఎంత ఉన్నాయి? అంటూ ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు డ్రామాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు.

‘‘హైదరాబాద్‌లో ఏపీ వారు చాలా మందే ఉన్నారు. అక్కడి నిత్యావసర వస్తువుల రేట్లు ఎలా ఉన్నాయో ఒకసారి కనుక్కో చంద్రబాబూ. ఇతర రాష్ట్రాల్లోని రేట్లు, ఇక్కడా ఒకేలా ఎందుకు ఉన్నాయి?. జనం అమాయకులని చంద్రబాబు అనుకుంటున్నారు. ప్రజలు తిరగపడి బాదేవరకు చంద్రబాబు ఇలానే మాట్లాడతారు. కాంతారావు, రాజనాల సినిమాల్లోని డైలాగులు ఇంకా చెప్తే ఎలా?’’ అని పేర్ని నాని ప్రశ్నించారు.

మల్లెల బాబ్జీ మరణ వాంగ్మూలం ఇచ్చేవరకు చంద్రబాబు కుట్ర తెలియలేదు. లేకపోతే అప్పట్లోనే ఎన్టీఆర్ ని చంపేసేవారు. 2024 తర్వాత చంద్రబాబు కూడా ఎన్టీఆర్ లాగా మానసికంగా కుంగిపోవాల్సిందే. సంక్షేమ పథకాల వలన రాష్ట్రం శ్రీలంక అవుతుందని మొన్నటి దాకా భోరుమని ఏడ్చారు. ఇప్పుడేమో అంతకన్నా ఎక్కువ సంక్షేమం అందిస్తామని అంటున్నారు. పవన్, చంద్రబాబును చూస్తే జాలేస్తుంది. జగన్ సత్తా ఏంటో వారిద్దరికీ ఇప్పుడు తెలిసొచ్చింది’’ అని పేర్ని నాని అన్నారు.
చదవండి: ప్రాజెక్టులకు ‘వెన్నుపోటు’.. ఈ ప్రశ్నలకు బదులేది బాబూ?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement