Parliament Monsoon Session 2022: లోక్‌సభ నుంచి టీఆర్‌ఎస్ ఎంపీల వాకౌట్

సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో నాల్గవరోజూ కూడా నిరసనల గళమే వినిపిస్తోంది. గురువారం ఉదయం పదకొండు గంటలకు ఉభయ సభలు ప్రారంభమై.. కాసేపటికి వాయిదా పడ్డాయి.
ఉదయం 11.30 గంకు లోక్‌సభ, మధ్యాహ్నాం 12 గం. రాజ్యసభ వాయిదా పడ్డాయి. అనంతరం ఉభయ సభలు మొదలుకాగా.. విపక్షాల నిరసనల నడుమే సభా కార్యకలాపాలు నడుస్తున్నాయి.
ఈ క్రమంలో లోక్‌సభలో జీఎస్టీ పన్ను భారంపై చర్చకు టీఆర్‌ఎస్‌ఎంపీల పట్టుబట్టారు. స్పీకర్ చర్చకు నిరాకరించడంతో.. ఎంపీలు వాకౌట్ చేశారు. టీఆర్‌ఎస్ తో పాటు డీఎంకే, ఎస్పీ, బీఎస్పీ, టీఎంసీ వాకౌట్ చేశారు.