సాక్షి, విజయవాడ: క్రెడిట్ చోరీలో నారా లోకేష్ అడ్డంగా దొరికిపోయారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలోనే రెన్యూ (Renew) పెట్టుబడులకు ఒప్పందం జరిగింది. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్‌లో సైతం రెన్యూతో ఒప్పందాలు కుదుర్చుకుంది. పెట్టుబడుల ఒప్పందంలో భాగంగా రెన్యూ పవర్ ప్రాజెక్టులకు వైఎస్ జగన్ హయాంలోనే అనంతపురం, శ్రీ సత్య సాయి జిల్లాల్లో భూ కేటాయింపులూ జరిగాయి. 600 మెగా వాట్లు, 300 మెగా వాట్లు సామర్థ్యం గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు మంజూరయ్యాయి.
అయితే విచిత్రంగా అదే రెన్యూ కంపెనీతో వైజాగ్ గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్‌లో కూటమి ప్రభుత్వ ఒప్పందం కుదుర్చుకుంది. రెన్యూ సంస్థను గత 5 ఏళ్లలో రాష్ట్రం నుండి పంపేసారంటూ నారా లోకేష్ పచ్చి అబద్ధాలు ఆడారు
వై ఎస్ జగన్ తెచ్చిన కంపెనీతో మళ్ళీ ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుటుంటుంది. ఇప్పటికే వైఎస్ జగన్ తన పాలనలో అందించిన అనేక సంక్షేమ పథకాలు,రాష్ట్రానికి తెచ్చిన పెట్టుబడులను చంద్రబాబు తన ఖాతాలో వేసుకొని క్రెడిట్ చోరీకి పాల్పడగా.. తాజాగా లోకేష్ సైతం రెన్యూతో ఒప్పందం కుదర్చుకుని క్రెడిట్ చోరీకి పాల్పడడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
2023 జూన్ 20న రెన్యూ ప్రోజెక్టుకి అనుమతులు ఇస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వం జిఓ 15 జారీ చేసింది. 2024 ఫిబ్రవరి5 న రెన్యూకి రెండో ప్రాజెక్ట్ మంజూరు చేస్తున్నట్లు జారీ చేసిన జీవోల్లో పేర్కొంది.
గత ప్రభుత్వంలో రెన్యూ పెట్టుబడుల ఒప్పందాలు, జీవోలపై ఇప్పటి సిఎస్,ఎనర్జీ సెక్రటరీగా కూడా ఉన్న విజయానంద్ సంతకాలు చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రెన్యూతో ఒప్పందాలు కుదుర్చుకోవడం, వాటికి గురించి ట్వీట్ చేసి నారా లోకేష్ అభాసుపాలయ్యారు.


