దళితులను చూస్తే చంద్రబాబుకు ఎందుకంత కడుపుమంట?

Mlc dokka manikya varaprasad asked why chandrababu hates dalits - Sakshi

మంత్రి ఆదిమూలపు సురేష్ మీద చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆ మాటలను వెనక్కు తీసుకోవాలని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్‌ డిమాండ్‌ చేశారు.యర్రగొండపాలెంలో చంద్రబాబు కావాలనే జనాన్ని రెచ్చగొట్టారని, టీటీడీ కార్యకర్తల ద్వారా రాళ్ల దాడి చేయించారని అన్నారు. వీడియోలు చూస్తే రాళ్లదాడి చేసిన వారు ఎవరనేది స్పష్టంగా కనిపిస్తుందని, కానీ దాన్ని తోసిపుచ్చి మాపై ఎదురుదాడి చేయటం ఏంటని ప్రశ్నించారు.

చంద్రబాబు వైఖరి చూస్తుంటే సురేష్‌కు భద్రత కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. మంత్రి సురేష్ మంచి విద్యావేత్త, అలాంటి వ్యక్తిపై ఇలాంటి దాడులు చేయటం కరెక్ట్ కాదు. చంద్రబాబుకు అసలు దళితులను చూస్తే ఎందుకంత కడుపుమంట అని నిలదీశారు. దళితులకు సీఎం జగన్‌ ఎంతో మేలుచేస్తూ అవినీతికి తావు లేకుండా పరిపాలన కొనసాగిస్తున్నారని, ప్రస్తుతం వారి జీవన ప్రమాణాలు కూడా పెరిగాయని డొక్కా మాణిక్య వరప్రసాద్‌ స్పష్టం చేశారు. అంతమాత్రానికే దళితులపై చంద్రబాబు ద్వేషం ఏంటన్నారు.

దళిత మంత్రి సురేష్‌కు రక్షణ కావాలని, అంతే కాకుండా చంద్రబాబు వ్యాఖ్యలపై విచారణ చేయాలని డిమాండ్ చేసారు. దళితులకు మంచి జరుగుతుంటే వారిపై మీ స్టాండ్ ఏంటని అన్నారు. రెండు లక్షల కోట్ల డబ్బు నేరుగా పేదలకే చేరితే చంద్రబాబుకు ఎందుకంత కడుపుమంట అని కూడా ప్రశ్నించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top