ఎమ్మెల్యే కొండబాబు అలక.. శంకుస్ధాపనకు డుమ్మా | Mla Kondababu Was Not Attend At Foundation Stone Laying Of Bio Methanation Plant | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే కొండబాబు అలక.. శంకుస్ధాపనకు డుమ్మా

Oct 25 2024 10:18 AM | Updated on Oct 25 2024 10:41 AM

Mla Kondababu Was Not Attend At Foundation Stone Laying Of Bio Methanation Plant

సాక్షి, కాకినాడ జిల్లా: కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అలక బూనారు. బయో మెథనేషన్ ప్లాంట్ శంకుస్ధాపనకు డుమ్మా కొట్టారు. రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ హాజరుకాగా, ఎమ్మెల్యే కొండబాబు రాకపోవడంతో శంకుస్ధాపన, భూమి పూజకు ఆయన దూరంగా ఉన్నారు. ఎమ్మెల్యేలు లేకుండానే ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీతో కలిసి మున్సిపల్ కమిషనర్‌ భావన ప్లాంట్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ప్లాంట్‌కు మున్సిపల్‌ కార్పొరేషన్‌ రెండెకరాల స్ధలం కేటాయించింది. 

ప్లాంట్‌కు మున్సిపల్ కమిషనర్ భావన  భూ కేటాయింపు చేయడంపై ఎమ్మెల్యే కొండబాబు గుర్రుగా ఉన్నారు. ‘‘నాకు తెలియదు.. నన్ను పిలవకండీ" అంటూ కొండబాబు చెప్పారంటూ చర్చ సాగుతోంది. గత కొంతకాలంగా మున్సిపల్ కమిషనర్ భావన, సిటీ ఎమ్మెల్యే మధ్య గ్యాప్‌ కొనసాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement