మేడిగడ్డపై వాస్తవాలు వెలికి తీయండి | Kishan Reddy wrote a letter to Gajendra Shekawat | Sakshi
Sakshi News home page

మేడిగడ్డపై వాస్తవాలు వెలికి తీయండి

Oct 25 2023 2:27 AM | Updated on Oct 25 2023 2:27 AM

Kishan Reddy wrote a letter to Gajendra Shekawat - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:     కాళేశ్వరం ప్రాజెక్టులో ముఖ్య భాగమైన మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీ పిల్లర్లు కుంగడానికి ఎవరు బాధ్యులో తేల్చాలని కోరుతూ కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి సోమవారం కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర షెకావత్‌కు లేఖ రాశారు. బ్యారేజీ భద్రతను పరిశీలించేందుకు కేంద్ర బృందాన్ని పంపాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర జల సంఘం సభ్యుడు అనిల్‌ జైన్‌ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీ మంగళవారం మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించింది.

కాగా గతేడాది పార్లమెంటులో ఆమోదం పొందిన ‘డ్యామ్‌ సేఫ్టీ బిల్లు’లో భాగంగా.. ‘కేంద్ర డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ’ నిపుణుల బృందాన్ని తెలంగాణకు పంపించి మేడిగడ్డ వద్ద క్షేత్ర స్థాయి పరిశీలన ద్వారా వాస్తవాలను వెలికి తీయా లని కేంద్రానికి రాసిన లేఖలో కిషన్‌రెడ్డి కోరారు. మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోవ డం దురదృష్టకరమని పేర్కొంటూ, 6వ బ్లాక్‌లోని గేట్‌ నంబర్‌ 15 నుంచి 20 వరకు కుంగిపోయాయని తెలిపారు. పెద్దగా శబ్దాలు వచ్చినట్లు స్థానికులు తెలిపాక, బ్యారేజీ గేట్లను తెరిచి నీటిని దిగువకు వదులుతున్నారని వివరించారు.

సాగునీటి కోసం నిల్వ చేసిన నీళ్లన్నీ ఇలా వృ«థాగా కిందికి వదలాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ నేపథ్యంలో బ్యారేజీ భద్రతకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానంగా.. ప్రాజెక్టు నిర్మాణానికి ముందు బోర్‌ హోల్‌ శాంపిల్స్‌ తీసుకుని భూమి సామర్థ్యాన్ని నిర్ణయించే పరీక్షలు నిర్వహించారా? లేదా తేల్చాలని విజ్ఞప్తి చేశారు. వర్షాకాలానికి ముందు, వర్షాకాలం తర్వాత ఏర్పడే పరిస్థితులకు అనుగుణంగా.. పైనుంచి వచ్చే వరద, దిగువకు వదిలే నీటి ప్రవాహానికి సంబంధించి రివర్‌ క్రాస్‌ సెక్షన్‌ పరీక్షలు, అధ్యయనాన్ని నిర్వహించారా? ఈ సందర్భంగా ఏమైనా ఇబ్బందులను గమనించారా? వాటన్నింటినీ పరిశీలించాలని కోరారు.

ఫౌండేషన్లో నాణ్యత లోపం
‘పిల్లర్ల కింద వేసిన ఫౌండేషన్‌ (పియర్స్‌) నాణ్య తతో నిర్మించలేదని స్పష్టమైంది. పియర్స్‌ నిర్మించే సమయంలో అక్కడ సాయిల్‌ ట్రీట్మెంట్‌ జరగలేద నేది అర్థమవుతోంది. ఫౌండేషన్‌ తనిఖీ వైఫల్యం కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని స్పష్ట మవుతోంది..’ అని కిషన్‌రెడ్డి ఆ లేఖలో పేర్కొ న్నారు. ప్రాజెక్టును ఈపీసీ (ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌ మెంట్‌ – కన్‌స్ట్రక్షన్‌) పద్ధతిలో కాంట్రాక్ట్‌ కంపెనీ చేసిందా?  లేక రాష్ట్ర నీటిపారుదల విభాగానికి చెందిన సీడీవో (సెంట్రల్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్‌) ద్వారా చేయించారా? అన్న విషయాలను పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement