హుజురాబాద్‌ ఉప ఎన్నిక: పనికి రాను ప్రచారానికి పోవాలే..

Huzurabad Bypoll: Most People Stop Work And Goes Election Campaign - Sakshi

మాట ముచ్చట..

సాక్షి, ఇల్లందకుంట(హుజూరాబాద్‌): ఆరు రోజుల్లో హుజూరాబాద్‌ ఉప ఎన్నిక. గ్రామాల్లో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీలకు చెందిన నేతలు తమ ప్రచారానికి పోటీ పడి గ్రామాల నుంచి మహిళా కూలీలను తీసుకెళ్తుండగా.. వ్యవసాయ పనులకు కొరత నెలకొంది. ఈ క్రమంలో ఓ గ్రామానికి చెందిన ఇద్దరు మహిళల మాట ముచ్చట.
చదవండి: అడ్డగోలు ఇల్లు కిరాయి.. వారం రోజులకే రూ.10 వేలు..అయినా కష్టమే?

లచ్చమ్మ: ఓ రాజక్క ఎటు పోతన్నవు.. ఇయ్యాల పత్తి ఏరటానికి వస్తవా..
రాజమ్మ: ఆ.. నేనెందుక వస్త.. నేనే ప్రచారానికి పోవాలే..
లచ్చమ్మ: నీ ప్రచారం సల్లగుండ రోజుంటదా..! ఎల్లకాలం కూలీ పనికి పోవుడే కదా మనకు..
రాజమ్మ: ఎల్లకాలం కూలీపనికి పోవుడే గానీ, ఓట్లు ఎప్పడికత్తాయా.. ఓట్లయిపోయే దాకా ప్రచారానికి పోవుడే కూలి.
లచ్చమ్మ:ప్రచారానికి పోతే గంతగనం ఇత్తాండ్రా పైసలు..
రాజమ్మ: పొద్దందాక ఎండలపోయి పత్తేరితే సాయంత్రం వరకు 300 ఇస్తరు. మరి ఇప్పుడు ప్రచారానికి అట్ల పోయి ఇట్ల అస్తం.. గవ్వే పైసలు ఇస్తుండ్రు.. గట్లనే రెండుమూడు మీటింగ్‌లకు పోతే డబ్బులు ఎక్కువ వస్తా లేవా మరి..
చదవండి: సెక్షన్‌ 49 పీ: మీ ఓటును మరెవరైనా వేశారా? వెంటనే ఇలా చేయండి..

లచ్చమ్మ:నీ పని మంచిగున్నది గానీ ఏ పార్టీ ప్రచారానికి పోతాన్నవు మరి..
రాజమ్మ: ఆ పార్టీ ఈ పార్టీ అని ఏం లేదు. ఎవ్వలు పిలిస్తే ఆ పార్టీకి పోవుడే.. ఇంకో గమ్మత్తు తెలుసా.. రెండుమూడు రోజుల నుంచి చాలా మంది పెద్దపెద్ద వాళ్లు రావడంతో డబ్బులు ఎక్కువగా ఎవ్వలు ఇస్తే అటు పోతాన్న.
లచ్చమ్మ:అంతేనంటవా..
రాజమ్మ: అంతే మరి.. అవసరమైతే పొద్దున ఓ పార్టీ ప్రచారం, సాయంత్రం మళ్లో పార్టీ ప్రచారానికి పోతాన్న..
లచ్చమ్మ: మీ ఆయనో పార్టీకి.. నువ్వో పార్టీకి ప్రచారానికి పోతాండ్రా..
రాజమ్మ: బరాబర్‌ పోతాం.. వాళ్లకు జనం గావాలే.. మాకు డబ్బులు కావాలే.. 
లచ్చమ్మ: మరి గిట్లయితే ఎట్ట.. పత్తి ఏరుడు ఎట్ట గావాలె..
రాజమ్మ: నాలుగైదు రోజులు ఆగరాదవ్వ.. గీ ఓట్లయిపోయినంక మస్తు మంది దొరుకుతరు.

లచ్చమ్మ:మరి ఊర్లల్లో ప్రజలు ఏటు వైపు మాట్లాడుతున్నారు.
రాజమ్మ: అబ్బో వాళ్లు ఎటు వైపు మాట్లాడుతలేరు. ఎవరు వచ్చినా వాళ్లకే జై అంటున్నారు. అసలు గిలాంటి ఎలచ్చన్లు మన జీవితంలో చూడలేదు.
లచ్చమ్మ:ఇంకా ఊరిలో ముచ్చట్లు ఏమున్నాయ్‌..
రాజమ్మ: అబ్బ సాలు గిట్ల మాట్లాడుతుంటే నాకు కూలి కూడా రాదు.. ఓ వెంకన్న వస్తాన్నా.. ఆగు.. లచ్చమ్మ జరా ఇంటికాడ సూడు చిన్న పొలగాడు ఉన్నడు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top