High Command To Digvijay Singh Solve Telangana Congress Issue - Sakshi
Sakshi News home page

తెలంగాణ కాంగ్రెస్‌పై హైకమాండ్‌ ఫోకస్.. రంగంలోకి దిగ్విజయ్ సింగ్

Dec 20 2022 12:33 PM | Updated on Dec 20 2022 2:22 PM

High Command To Digvijay Singh Solve Telangana Congress Issue - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్‌పై హైకమాండ్‌ ఫోకస్‌ పెట్టింది. రాష్ట్ర కాంగ్రెస్‌లో నెలకొన్న వివాదాల పరిష్కారానికి అధిష్టానం దూతలు రంగంలోకి దిగారు. సంక్షోభ నివారణ బాధ్యతలు రాజ్యసభ ఎంపీ దిగ్విజయ్‌ సింగ్‌కు అప్పజెప్పుతూ ఏఐసీసీ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో కాంగ్రెస్‌ నేత మహేశ్వర్‌ రెడ్డికి దిగ్విజయ్‌ సింగ్ మంగళవారం ఫోన్‌ చేశారు. సాయంత్రం సీనియర్ల సమావేశాన్ని వాయిదా వేయాలని దిగ్విజయ్‌ సూచించారు.

ఈ మేరకు మహేశ్వర్‌ రెడ్డి మాట్లాడుతూ.. త్వరలోనే దిగ్విజయ్‌​ సింగ్‌ హైదరాబాద్‌కు వస్తున్నారని పేర్కొన్నారు. పార్టీ నేతలతో దిగ్విజయ్‌  భేటీ కానున్నారని తెలిపారు. సమస్యను పరిష్కరిస్తామని దిగ్విజయ్‌ చెప్పారని పేర్కొన్నారు.

కాగా ముందస్తు నిర్ణయం ప్రకారం మంగళవారం సాయంత్రం మహేశ్వర్‌ రెడ్డి ఇంట్లో కాంగ్రెస్‌ సీనియర్లు భేటీకావాల్సి ఉంది. అయితే దిగ్విజయ్‌ సింగ్‌ ఫోన్‌తో వారు వెనక్కి తగ్గారు. తాజా పరిణామాల నేపథ్యంలో సాయంత్రం జరగాల్సిన కాంగ్రెస్‌ సీనియర్ల సమావేశం వాయిదా పడింది. మరోవైపు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కతో మహేష్‌ గౌడ్‌, కోదండరెడ్డి భేటీ అయ్యారు. సాయంత్రం సీనియర్ల సమావేశం వాయిదా వేయాలని కోరారు.
చదవండి:  తెలంగాణ పీసీసీలో విభేదాలపై ప్రియాంక నజర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement