రోడ్డు షో మధ్యలోనే ముగించిన అమిత్‌ షా | GHMC Elections 2220: Amit Shah Reached Hyderabad | Sakshi
Sakshi News home page

రోడ్డు షో మధ్యలోనే ముగించిన అమిత్‌ షా

Nov 29 2020 11:29 AM | Updated on Nov 29 2020 3:22 PM

GHMC Elections 2220: Amit Shah Reached Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఆదివారం హైదరాబాద్‌ చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయం చేరుకున్న ఆయన అక్కడ నుంచి నేరుగా  చార్మినార్‌ బయల్దేరి వెళ్లారు. అక్కడ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో అమిత్‌ షా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తరువాత సికింద్రాబాద్ పార్లమెంటరీ పరిధిలోని వారాసిగూడ నుంచి సీతాఫల్‌ మండి హనుమాన్‌ టెంపుల్‌ వరకు అమిత్ షా రోడ్‌ షో నిర్వహించారు. మధ్యాహ్నం 1.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బీజేపీ ఆఫీసులో ఉండి సాయంత్రం 5 గంటలకు తిరిగి ఢిల్లీకి వెళ్తారు. కాగా హోంమంత్రి  చార్మినార్ పర్యటన నేపథ్యంలో పాతబస్తీకి భారీగా కేంద్ర బలగాలు మోహరించాయి. పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. మరోవైపు అమిత్‌ షాకు ఘన స్వాగతం పలికేందుకు కాషాయ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. (గ్రేటర్‌ ప్రచారం: ట్రంప్‌ ఒక్కరే మిగిలిపోయారు)

అప్‌డేట్స్‌..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement