BJP MLA Etela Rajender Key Comments on CM KCR - Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ను ఎవ్వరూ నమ్మరు..

Jul 20 2023 3:20 AM | Updated on Jul 20 2023 2:18 PM

Etela Rajender comments on kcr  - Sakshi

అబిడ్స్‌: జాతీయ రాజకీయాల్లో సీఎం కేసీఆర్‌ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారైందని బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్‌ ఎద్దేవా చేశారు. తాను అనుసరిస్తున్న అవకాశ రాజకీయ విధానాలతో అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్‌ నమ్మే పరిస్థితి లేదన్నారు.

బుధవారం బీజేపీ కార్యాలయంలో ఈటల మీడియాతో మా ట్లాడారు. చివరికి తెలంగాణ ప్రజలు కూడా కేసీ ఆర్‌ను నమ్మడం లేదన్నారు. ‘విమానాలు వేసుకొని అన్ని పార్టీల దగ్గరికి వెళ్లి.. నన్ను నాయకున్ని చేయండి దేశమంతా ఎన్నికలకు ఫండింగ్‌ చేసా’్త అని చెప్పి వచ్చారు. అయినా ఆయన్ను ఎవరూ నమ్మడం లేదు’ అని ఈటల విమర్శించారు.

ఊదితే కొట్టుకు పోయే పార్టీ బీఆర్‌ఎస్‌...
‘అక్రమ కేసులు పెట్టి బీజేపీ నాయకులను, కా ర్యకర్తలను వేధిస్తున్నారు. మీ పాలనకు పోయేకా లం వచ్చింది. కేసీఆర్‌ మీ పార్టీ ఊదితే కొట్టుకు పోయే పార్టీ. మాతో గొక్కోవద్దు, ఖబడ్దార్‌’ అని ఈటల హెచ్చ రించారు. గోషామ హల్‌లో, గజ్వేల్‌లో, హుజూరాబాద్‌ తదితర చోట్ల బీఆర్‌ఎస్‌ నేతలు దౌర్జన్యా నికి పాల్పడుతున్నా రని ధ్వజమెత్తారు.

అధికార పార్టీ అసహనంతో బీజేపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్న  విష యాన్ని కేంద్ర ప్రభుత్వం గమనిస్తోందన్నారు. గోషామహల్‌లో బీఆర్‌ఎస్‌ నేతలు దౌర్జన్యం చేస్తుంటే బీజేపీ కార్పొరేటర్‌ శశికళ సముదాయించే ప్రయత్నం చేయగా.. చివరికి ఆమెపై కేసులు పెట్టడం అన్యాయమన్నారు.

ఎమ్మెల్యే రాజాసింగ్‌తో ఈటల భేటీ
గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌తో ఈటల  సమావేశమయ్యారు. ధూల్‌పేటలోని రాజాసింగ్‌ నివాసానికి విచ్చేసి పలు అంశాలపై చర్చించారు. సమావేశం అనంతరం ఎమ్మెల్యే ఈటల  మీడియా తో మాట్లాడుతూ,   రాజాసింగ్‌పై సస్పెన్షన్‌ ఎత్తివే త జాతీయ నాయకత్వ పరిధిలో ఉందన్నారు. దీని పై త్వరలోనే నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నానని చెప్పారు. ఎమ్మెల్యే రాజాసింగ్‌ మాట్లాడుతూ... బీ ఆర్‌ఎస్, మజ్లిస్‌ పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా తిరి గి బీజేపీదే విజయమన్నారు. కార్యకర్తలకు, నాయ కులకు తాను అండగా ఉంటానని భరోసానిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement