ఉప ఎన్నికలో శివసేన పేరు, గుర్తు వాడొద్దు.. షిండే, ఠాక్రే వర్గాలకు ఈసీ షాక్‌

Ec Bars Uddhav Thackeray Eknath Shinde From Using Shiv Sena Name - Sakshi

న్యూఢిల్లీ:అంథేరీ ఈస్ట్‌ అసెంబ్లీ స్థానానికి జరగబోయే ఉప ఎన్నికలో శివసేన పేరు, ఎన్నికల గుర్తు ‘విల్లు, బాణం’ను ఏక్‌నాథ్‌ షిండే, ఉద్ధవ్‌ ఠాక్రేవర్గాలు ఉపయోగించుకోకుండా ఎన్నికల సంఘం(ఈసీ) నిషేధం విధించింది. పార్టీ పేరు, ఎన్నికల గుర్తు వాడుకోవద్దని రెండు వర్గాలను ఆదేశించింది. ఈ మేరకు శనివారం మధ్యంతర ఉత్తర్వు జారీ చేసింది.

ఈ ఉప ఎన్నిక కోసం ఏవైనా మూడు నచ్చిన పేర్లను, అందుబాటులో ఉన్న గుర్తుల్లో కొన్నింటిని ఎంపిక చేసుకొని, సోమవారంలోగా తమకు తెలియజేయాలని సూచించింది. వాటిని రెండు వర్గాల అభ్యర్థులకు కేటాయిస్తామని పేర్కొంది. పార్టీ ఎన్నికల గుర్తును తమ అభ్యర్థికే కేటాయించాలని షిండే వర్గం కోరగా ఈసీ తిరస్కరించింది.

శివసేన ఈ ఏడాది జూన్‌లో రెండుగా చీలిపోయిన సంగతి తెలిసిందే. అసలు శివసేన తమనంటూ షిండే, ఠాక్రే వర్గాలు వాదిస్తున్నాయి. దీనిపై ఎన్నికల సంఘమే నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. పార్టీపై హక్కును నిరూపించుకోవడానికి అక్టోబర్‌ 7లోగా ఆధారాలు సమర్పించాలని ఇరువర్గాలకు ఈసీ ఆదేశించింది.
చదవండి: థరూర్.. ఓ విఫల ప్రయత్నం.!

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top