ట్విస్ట్‌: ధర్మపురి ఎన్నికపై హైకోర్టు ఆదేశాలు.. స్ట్రాంగ్‌ రూమ్‌ తాళాలు మిస్‌ | Sakshi
Sakshi News home page

ట్విస్ట్‌: ధర్మపురి అసెంబ్లీ ఎన్నిక వివాదంపై హైకోర్టు కీలక ఆదేశాలు.. స్ట్రాంగ్‌ రూమ్‌ తాళాలు మిస్‌

Published Mon, Apr 10 2023 10:26 AM

Dharmapuri Election Results Telangana High Court Orders Open Strong Room - Sakshi

జగిత్యాల: జిల్లాలోని ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గానికి 2018లో జరిగిన ఎన్నికల డాక్యుమెంట్‌ కాపీలు, సీసీ ఫుటేజీలు, ఇతర ఎన్నికల సామగ్రి భద్రపర్చిన స్ట్రాంగ్‌రూమ్‌ తాళాలు మిస్సయ్యాయి. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని, మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఎన్నిక అక్రమమని కాంగ్రెస్‌ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అప్పట్లో హైకోర్టును ఆశ్రయించారు.

ఈ కేసు సుమారు నాలుగున్నరేళ్లుగా కొనసాగుతోంది. అయితే, ఎన్నికల ఫలితాలు భద్రపరిచిన స్ట్రాంగ్‌రూమ్‌ను తెరిచి 17ఏ, 17సీ డాక్యుమెంట్‌ కాపీలు, సీసీ ఫుటేజీలు, ఎన్నికల ప్రొసీడింగ్స్‌ను ఈనెల 11న తమకు సమరి్పంచాలని హైకోర్టు ఇటీవల ఆదేశించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌ యాస్మిన్‌ బాషా సమక్షంలో మల్యాల మండలం నూకపల్లి వీఆర్‌కే కళాశాలలోని స్ట్రాంగ్‌రూమ్‌ను తెరిచేందుకు ఉద్యోగులు వెళ్లారు. ధర్మ పురి నియోజకవర్గానికి సంబంధించిన మూడు స్ట్రాంగ్‌రూమ్‌లు వీఆర్‌కే కళాశాలలో ఉండగా, అందులో కోర్టు అడిగిన 17ఏ, 17సీ వీడియో ఫుటేజీలు భద్రపర్చిన గది లాక్‌ ఓపెన్‌ కాలేదు.

మిగతావి రెండు ఓపెన్‌ అయ్యాయి. అందులో ఈవీఎంలు, వీవీప్యాడ్‌లు భద్రంగానే ఉన్నాయి. కోర్టు అడిగిన డాక్యుమెంట్లు భద్రపర్చిన స్ట్రాంగ్‌రూమ్‌ మాత్రమే ఓపెన్‌ కాకపోవడం వివాదాస్పదంగా మారింది. ఈ విషయమై కలెక్టర్‌ యాస్మిన్‌ బాషా మాట్లాడుతూ.. ధర్మపురి నియోజకవర్గం స్ట్రాంగ్‌రూమ్‌–3కి లాక్‌ ఓపెన్‌ కావడం లేదని తెలిపారు. పతినెలా వచ్చి చూసినప్పుడు తాళానికి సీల్‌ వేసే ఉందన్నారు. ఇదే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్తామని, నివేదిక సమరి్పస్తామని, హైకోర్టు నిర్ణయానుసారం వ్యహరిస్తామని కలెక్టర్‌ స్పష్టం చేశారు.  

కలెక్టర్‌ తప్పిదం వల్లే: అడ్లూరి 
ధర్మపురి నియోజకవర్గ ఎన్నికల వీడియో ఫుటేజీ, డాక్యుమెంట్లు ఉంచిన రూమ్‌ 786051 తాళం చెవి లేకపోవడానికి కలెక్టర్, మంత్రి కొప్పుల ఈశ్వరే బాధ్యత వహించాలని డీసీసీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అన్నారు. కలెక్టర్‌ తప్పిదం వల్లే ఇది జరిగిందని ఆరోపించారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement