
వేరుశనగ పంటను పరిశీలిస్తున్న రామకృష్ణ
రాప్తాడు: సినిమా టికెట్లపై కాకుండా ప్రజా సమస్యలపై పవన్‌కల్యాణ్ స్పందిస్తే బాగుంటుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ హితవు పలికారు. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ పరిరక్షణకు 230 రోజులుగా కార్మికులు పోరాటాలు చేస్తున్నా.. అక్కడికి పవన్ ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. కాగా, ఈ ఏడాది వేరుశనగ పంట పూర్తిగా ఎండిపోయిందని, నష్టపోయిన రైతులందరినీ ప్రభుత్వం ఆదుకోవాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.
మంగళవారం ఆయన అనంతపురం జిల్లా రాప్తాడు మండలం హంపాపురం వద్ద ఎండిన వేరుశనగ పంట పొలాలను పరిశీలించారు. సీఎం జగన్ తక్షణమే వ్యవసాయ శాఖ మంత్రిని, వ్యవసాయ, రెవెన్యూ అధికారులను పంట పొలాలకు పంపాలని సూచించారు. రైతులకు పరిహారం అందేలా చూడాలని కోరారు.