బెంగళూరులో ఆయనకు రూ.200 కోట్ల బంగ్లా.. | Cong demands cancellation of Rajeev Chandrasekhar’s nomination | Sakshi
Sakshi News home page

బెంగళూరులో ఆయనకు రూ.200 కోట్ల బంగ్లా..

Mar 24 2026 5:30 PM | Updated on Mar 24 2026 5:51 PM

Cong demands cancellation of Rajeev Chandrasekhar’s nomination
  • అఫిడవిట్‌లో కేరళ బీజేపీ అధ్యక్షుడు పేర్కొనలేదు
  • రాజీవ్ చంద్రశేఖర్‌ నామినేషన్‌ రద్దు చేయాలి: కాంగ్రెస్‌
     

తిరువనంతపురం: అసెంబ్లీ ఎన్నికల వేళ కేరళ బీజేపీ అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్‌పై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేసింది. ఎన్నికల అఫిడవిట్‌లో ఆయన ఆస్తి వివరాలను పూర్తిగా వెల్లడించలేదని చెప్పింది. బెంగళూరులోని కోర్మంగల ప్రాంతంలో ఉన్న సుమారు రూ.200 కోట్ల విలువైన బంగ్లాను అఫిడవిట్‌లో ఆయన పేర్కొనలేదని కాంగ్రెస్‌ ఆరోపించింది.

ఆ 49,000 చదరపు అడుగుల బంగ్లా సుమారు 1.07 ఎకరాల్లో విస్తరించి ఉన్న ప్రీమియం ప్రాంతంలో ఉందని కాంగ్రెస్‌ పేర్కొంది. అఫిడవిట్‌లో రాజీవ్‌ చంద్రశేఖర్‌ ఇల్లు, కారు లేవని పేర్కొన్నారని కాంగ్రెస్ అంటోంది. ఇదే చిరునామాలో తన నివాసంగా ఉందని గతంలో రాజీవ్‌ చంద్రశేఖర్‌ అఫిడవిట్‌లో పేర్కొన్నట్లు కాంగ్రెస్ తెలిపింది.

ఆస్తికి సంబంధించిన పన్నును మార్చి 17న చెల్లించారని కాంగ్రెస్ పేర్కొంది. ఈ విషయంపై ప్రజాప్రతినిధుల చట్టం కింద చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కాంగ్రెస్ కోరింది.

కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో నేమోం నియోజకవర్గం నుంచి రాజీవ్ చంద్రశేఖర్‌ పోటీ చేస్తున్న సమయంలో ఈ వివాదం వెలుగులోకి వచ్చింది. రాజీవ్ చంద్రశేఖర్ ప్రకటించిన మొత్తం ఆస్తి విలువ రూ.93 కోట్లకు పైగా ఉంది. కాంగ్రెస్‌ చేసిన ఆరోపణలపై ఇప్పటివరకు ఆయన లేదా బీజేపీ నుంచి స్పందన లేదు. ఇప్పుడు ఈ విషయంపై ఎన్నికల సంఘం తీసుకునే చర్యపై అందరి దృష్టి ఉంది. రాజీవ్ చంద్రశేఖర్ నామినేషన్‌ను రద్దు చేయాలని కాంగ్రెస్‌ కోరింది. కాగా, కేరళ ఎన్నికలు ఏప్రిల్‌ 9న జరగనున్నాయి. 

 

Advertisement
 
Advertisement
Advertisement