టీడీపీ అరాచకాలు.. వైఎస్‌ జగన్‌ను కలిసిన చిత్తూరు వైఎస్సార్‌సీపీ నేత | Chittoor 5th Division Ysrcp In Charge Muralidhar Reddy Meets Ys Jagan | Sakshi
Sakshi News home page

టీడీపీ అరాచకాలు.. వైఎస్‌ జగన్‌ను కలిసిన చిత్తూరు వైఎస్సార్‌సీపీ నేత

Apr 2 2025 4:19 PM | Updated on Apr 2 2025 4:30 PM

Chittoor 5th Division Ysrcp In Charge Muralidhar Reddy Meets Ys Jagan

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని చిత్తూరు ఐదో డివిజన్‌ వైఎస్సార్‌సీపీ ఇంఛార్జ్‌ మురళీధర్‌రెడ్డి బుధవారం కలిశారు. చిత్తూరు జిల్లా కొంగరెడ్డిపల్లిలో తనపై దాడికి పాల్పడిన టీడీపీ నాయకుల సీసీ కెమెరా విజువల్స్‌ను వైఎస్‌ జగన్‌కు ఆయన చూపించారు.

సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టినందుకు చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్‌ అనుచరులు దాడిచేసి తీవ్రంగా గాయపరిచారని, ఎమ్మెల్యే అరాచకాలను వైఎస్‌ జగన్‌కు మురళీధర్‌రెడ్డి వివరించారు. మురళీ కుటుంబానికి న్యాయం జరిగే వరకూ పూర్తి అండగా ఉంటామని వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. అవసరమైన పూర్తి న్యాయ సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. మురళీధర్‌రెడ్డి వెంట చిత్తూరు వైఎస్సార్‌సీపీ ఇంఛార్జ్‌ విజయానందరెడ్డి ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement