BJP MP GVL Narasimha Rao Sensational Comments On CM KCR, Details Inside - Sakshi
Sakshi News home page

కేసీఆర్‌పై బీజేపీ ఎంపీ జీవీఎల్‌ సంచలన వ్యాఖ్యలు

Apr 13 2023 7:34 PM | Updated on Apr 13 2023 7:45 PM

BJP MP GVL Narasimha Rao Sensational Comments On CM KCR - Sakshi

సాక్షి, విజయవాడ: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు సీరియస్‌ అయ్యారు. కేసీఆర్‌ కొత్త డ్రామాకు తెరలేపారు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ను ఆంధ్ర ద్రోహి అంటూ సంచలన కామెంట్స్‌ చేశారు. 

​కాగా, జీవీఎల్‌ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ కొనుగోలుకు అధికారులను పంపిస్తామని ఆంధ్రా ద్రోహి కేసీఆర్‌ మాట్లాడుతున్నారు. ఏపీని కేసీఆర్‌ ఇప్పటికీ మోసం చేస్తూనే ఉన్నారు. స్టీల్‌ప్లాంట్‌కు వర్కింగ్‌ క్యాపిటల్‌ సమస్య ఉన్న మాట వాస్తవమే. ఈ అంశంపై కేంద్ర మంత్రులకు లేఖలు రాశాం. తెలంగాణ అప్పుల ఊబిలో కూరుకుపోవడానికి కారణం కేసీఆరే. ఆయన రాజకీయ అవసరాల కోసం ఏపీ ఉద్ధరిస్తాననడం సిగ్గుచేటు. ఏపీలో ‍డ్రామాలకు తెరతీస్తే తగిన బుద్ధి చెబుతాం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement