తెలంగాణను టీఆర్‌ఎస్‌ పార్టీ హైజాక్‌ చేసింది..

BJP Leader Gangadi Krishnareddy Comments On CM KCR In Karimnagar - Sakshi

సాక్షి, కరీంనగర్‌టౌన్‌: సీమాంధ్రుల పాలన నుంచి విముక్తి కల్పించి తెచ్చుకున్న తెలంగాణను కేసీఆర్‌ నేతృత్వంలోని టీఆర్‌ఎస్‌ బంగారు తెలంగాణ పేరుతో హైజాక్‌ చేసిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఆరోపించారు. బుధవారం నగరంలోని ఓ హోటల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రజాసంగ్రామ యాత్ర కరపత్రాలను ఆవిష్కరించి మాట్లాడారు. ప్రభుత్వ భూములు అమ్మి హుజూరాబాద్‌లో తన పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పథకాలు అమలు చేస్తుండటం సిగ్గుచేటన్నారు.

ప్రజా అవసరాలపై నిరంతరం దృష్టి సారించాల్సిన అధికారులను కార్యకర్తల్లా మార్చుకొని, హుజూరాబాద్‌ ఉపఎన్నికల్లో పని చేయిస్తుండటం శోచనీయమన్నారు. ప్రభుత్వ అవినీతి అక్రమాలపై ప్రచారం చేస్తున్న బీజేపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయిస్తూ, పోలీసులతో బెదిరింపులకు గురిచేస్తున్నారని దుయ్యబట్టారు. ఈనెల 28 నుంచి చేపడుతున్న ప్రజా సంగ్రామ యాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 

చదవండి: Malla Reddy Vs Revanth Reddy: తొడగొట్టి రేవంత్‌ రెడ్డికి సవాల్‌ విసిరిన మంత్రి మల్లారెడ్డి

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top