మోదీ నాయకత్వాన్ని బలపర్చాలి: బండి | Bandi Sanjay comments on BRS Party | Sakshi
Sakshi News home page

మోదీ నాయకత్వాన్ని బలపర్చాలి: బండి

Sep 10 2023 4:21 AM | Updated on Sep 10 2023 2:34 PM

Bandi Sanjay comments on BRS Party - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎన్నారైలు ఎన్నికలప్పుడు భారతదేశానికి వచ్చి ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని బలప రచా­లని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ అన్నారు. అమెరి­కాలోని న్యూజెర్సీలో ఓవర్సీస్‌ ఫ్రెండ్స్‌ ఆఫ్‌ బీజేపీ(అఫ్‌ బీజేపీ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్నియ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అవినీతికి పాల్పడటం తప్ప అభివృద్ధి చేసిందేమీలేదని ఆరోపించారు.

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే విమోచన దినోత్సవాన్ని అధికారికంగా చేస్తామని కేంద్ర హోంమంత్రి ప్రకటించడంపై తెలంగాణ ఎన్నారైలు హర్షం వ్యక్తం చేశారని తెలిపారు. కార్యక్రమంలో అఫ్‌ బీజేపీ మాజీ అధ్యక్షుడు అనుగుల కృష్ణారెడ్డి, తెలంగాణ అఫ్‌–బీజేపీ కన్వినర్‌ విలాస్‌రెడ్డి, సంతోష్ రెడ్డి, తుమ్మల శ్రీకాంత్‌రెడ్డి, యంజాల వంశీ, కట్టా ప్రదీప్‌రెడ్డి, మధుకర్, సముద్రాల గోపి, అమెరికన్‌ తెలుగు అసోసియేషన్, నార్త్‌ అమెరికన్‌ తెలుగు అసోసియేషన్, మన అమెరికన్‌ తెలుగు అసోసియేషన్, ఇతర తెలుగు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement