
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సినీ నటుడు డాక్టర్ రాజేంద్రప్రసాద్‌ను కలిశారు. సోమవారం ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ సోము వీర్రాజును శాలువాతో సత్కరించారు. సినీ నటి హేమ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. కాగా సోము వీర్రాజు గతంలో మెగాస్టార్ చిరంజీవిని కలిసిన విషయం తెలిసిందే. బీజేపీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా ఆయనతో సమావేశమయ్యారు. (చదవండి: టీడీపీ హయాంలో విచ్చలవిడి అవినీతి)