పురుషులకు ఉచిత బస్సు ప్రయాణం.. ప్రతి ఇంటికి ఫ్రీగా ఫ్రిడ్జి | AIADMK releases manifesto for 2026 Tamil Nadu polls | Sakshi
Sakshi News home page

పురుషులకు ఉచిత బస్సు ప్రయాణం.. ప్రతి ఇంటికి ఫ్రీగా ఫ్రిడ్జి

Mar 24 2026 8:17 PM | Updated on Mar 24 2026 8:37 PM

AIADMK releases manifesto for 2026 Tamil Nadu polls

చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ అన్నాడీఎంకే మేనిఫెస్టో విడుదల చేసింది. తమిళనాడు అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి మంగళవారం 297 హామీలతో ఈ మానిఫెస్టోను విడుదల చేశారు. 

కుటుంబంలోని యజమానురాలికి ప్రతినెల రూ.2000, మహిళలతో పాటు పురుషులకు ఉచిత బస్సు సదుపాయం కల్పిస్తామని చెప్పారు. ప్రతి ఇంటికి ఫ్రీగా ఫ్రిడ్జి ఇస్తామని అన్నాడీఎంకే చెప్పింది. పన్నుల భారం, వస్తువుల ధరల పెరుగుదల ప్రభావాలను తగ్గించేందుకు ప్రతి కుటుంబానికి రూ.10,000 ప్రత్యేక సాయం ఇస్తామని పేర్కొంది.

"పాలన సామర్థ్యం లేని స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే గత 5 సంవత్సరాల్లో వస్తువుల ధరలు భారీగా పెరిగాయి. ప్రజలు తీవ్రంగా ప్రభావితమయ్యారు. ఆస్తి పన్ను, ఇల్లు పన్ను, విద్యుత్ చార్జీలు, నీటి చార్జీలు పెరిగాయి. దాంతో కుటుంబాల రోజువారీ ఆర్థిక భారం ఎక్కువైంది. ఈ భారం తగ్గించేందుకు ప్రతి కుటుంబానికి రూ.10,000 ప్రత్యేక సాయం ఇస్తాం" అని మేనిఫెస్టోలో ఉంది. కాగా, తమిళనాడులో ఏప్రిల్ 23న ఒకే దశలో పోలింగ్ జరుగుతుంది. మే 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.  

మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు

  • ఈపీఎస్ మహిళల కోసం "కుల విలక్కు పథకం"    

  • రేషన్ కార్డు ఉన్నవారికి బియ్యంతో పాటు పప్పుధాన్యాలు

  • ఉచితంగా ఫ్రిడ్జి కూడా ఇస్తామని ప్రకటన

  • మహిళలతో పాటు పురుషులకు కూడా ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం 

  • ప్రతి రేషన్ కార్డు కుటుంబానికి సంవత్సరానికి 3 ఉచిత వంట గ్యాస్ సిలిండర్లు 
     

Advertisement
 
Advertisement
Advertisement