పెద్దపల్లి: కార్పొరేట్‌కు దీటుగా జిల్లా ఆసుపత్రిలో సేవలు అందిస్తున్నారని బీసీ జేఏసీ జిల్లా వైస్ చైర్మన్ కొండి సతీశ్ అన్నారు. వరల్డ్ హెల్త్ డే సందర్భంగా నాలుగు రాష్ట్రస్థాయి అవార్డులు అందుకున్న డీసీహెచ్‌ఎస్ డాక్టర్ శ్రీధర్‌ను జేఏసీ ఆధ్వర్యంలో సత్కరించారు. పేద రోగులను దృష్టిలో ఉంచుకొని వారికి ఆర్థిక భారం లేకుండా కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను ఉచితంగా అందిస్తున్నారని జిల్లా ఆసుపత్రి వైద్యబృందాన్ని అభినందించారు. హైదరాబాద్‌లో జరిగే శస్త్రచికిత్సలను సైతం జిల్లా కేంద్రంలోనే విజయవంతంగా నిర్వహించటం గొప్ప విషయమన్నారు. నాయకులు అరగొండ రాజ్‌కుమార్, మిట్టపల్లి శ్రీను, గుమ్మడి ప్రసాద్, తిరుమలేశ్, అరుణ్, రవి తదితరులు పాల్గొన్నారు.
ఐదెకరాల భూమి కేటాయించాలి
పెద్దపల్లి: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలు అమలు చేయాలని తెలంగాణ ఎరుకల ప్రజాసమితి రాష్ట్ర అధ్యక్షులు కెమసారం తిరుపతి అన్నారు. గురువారం ప్రెస్‌క్లబ్‌లో జిల్లా అధ్యక్షుడు మానుపాటి రవి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఎరుకల కులస్తులకు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పందుల పెంపకందారులకు ప్రతీ కుటుంబానికి 5ఎకరాల భూమి ఇవ్వాలన్నారు. ఏకలవ్వ కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.500కోట్ల బడ్జెట కేటాయించాలన్నారు. బల్దియాల్లో పందులను చంపి తమ ఉపాధిని దెబ్బతీస్తున్నారని, పందుల యజమానులకు కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు కల్పించాలన్నారు. శాసీ్త్రయ పద్ధతిలో పందుల పెంపకం కోసం ప్రభుత్వమే శిక్షణ ఇప్పించి 100శాతం సబ్సిడీతో పందుల ఫామ్స్ ఏర్పాటు చేయలన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు మానుపాటి శ్రీనివాస్, సంపత్, రేవెళ్ళి తిరుపతి, మంచిర్యాల జిల్లా అధ్యక్షడు ఉండ్రాళ్లు ఎల్లయ్య, సార్ల తిరుపతి, లోకిని శారద, కర్ర రామమల్ల మ్మ, మానుపాటి కనుకమ్మ, బిజిలి శ్రీనివాస్, అంజి, మానుపాటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
కస్టమ్స్ ఇన్‌స్పెక్టర్‌గా ఎంపిక
పెద్దపల్లి: జిల్లాకేంద్రానికి చెందిన లైశేట్టి అఖిల్‌కృష్ణ గురువారం ఎస్‌ఎస్‌సీ (స్టాఫ్ సెలక్షన్ కమిటీ) ప్రకటించిన ఫలితాల్లో జనరల్ కేటగిరిలో కస్టమ్స్ ఇన్‌స్పెక్టర్‌గా ఎంపికయ్యాడు. లైశెట్టి భిక్షపతి–అనిత దంపతులకు కుమారుడు అఖిల్‌కృష్ణ 2025లో ప్రకటించిన గ్రూప్– 4 ఫలితాల్లో ఉస్మానియా యూనివర్సిటీ జూనియర్ అసిస్టెంట్‌గా, ఐడీబీఐ బ్యాంకులో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగాలు సాధించాడు. ఉద్యోగం చేస్తూనే ఉన్నత ఉద్యోగం సాధించాలని లక్ష్యంతో ఎస్‌ఎస్‌సీకి ప్రిపేర్ అయి సెలెక్ట్ అయ్యాడు.
అంబేడ్కర్ జయంతిని విజయవంతం చేయాలి
పెద్దపల్లి:జిల్లా కేంద్రంలో ఈనెల 14న నిర్వహించే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి వేడుకల్లో ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. ఉదయం 10 గంటలకు ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, ఉద్యోగులు, వివిధ సంఘాల బాధ్యులు వేడుకల్లో పాల్గొనాలని కోరారు.


