ఆకట్టుకుంటున్న చేనేత హస్తకళా మేళా | - | Sakshi
Sakshi News home page

ఆకట్టుకుంటున్న చేనేత హస్తకళా మేళా

Apr 10 2026 10:33 AM | Updated on Apr 10 2026 10:33 AM

కోల్‌సిటీ(రామగుండం): చూడచక్కని బొమ్మలు.. ధర్మవరం, వెంకటగిరి, గద్వాల్‌, పోచంపల్లి చీరలు, ఇలా కళ్లు మిరుమిట్లు గొలిపే వస్తువులకు గోదావరి ఖని వేదికయ్యింది. ఆధునిక సొబగులద్దుకుంటున్న సంప్రదాయ హస్తకళను హైదరాబాద్‌కు చెందిన ‘కళా సిల్క్‌ చేనేత హస్తకళా సొసైటీ’ ఇటీవల గోదావరిఖనిలో ప్రత్యేక మేళాను ప్రారంభించింది. ఆర్జీ–1 జీఎం ఆఫీస్‌ సమీపంలోని సింగరేణి కమ్యూనిటీ హాల్లో సుమారు 40 వరకు హస్తకళా, చేనేత వస్త్ర ప్రదర్శన, అమ్మకాల స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు.

ధర్మవరం, వెంకటగిరి తదితర చీరలు

తెలంగాణలో ప్రఖ్యాతిగాంచిన పోచంపల్లి, గద్వాల, నారాయణపేట పట్టు చీరలతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని ధర్మవరం, వెంకటగిరి, మంగళగిరి, కళంకారి, ఉప్పాడ, అస్సాం మూగా, బిహార్‌ బాగల్పుర సిల్క్స్‌, టస్సర్‌, జమ్మూ, కశ్మీర్‌లోని ఎంబ్రాయిడరీ చీరలు, గుజరాత్‌లోని బాందని, కచ్చ ఎంబ్రాయిడరీ శారీస్‌, రాజస్థాన్‌లోని కోటా, బంధాని, ఉత్తరప్రదేశ్‌లోని జమ్దాని, బనారస్‌, లక్నో డ్రెస్‌ మెటీరియల్స్‌ ఛత్తీస్‌గఢ్‌ ట్రిబిల్‌ వర్క్స్‌ కోసా సిల్క్‌, ఫ్యాన్సీ చీరలు, చుడీదార్స్‌ ఆకట్టుకుంటున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement