రామగుండం: ఆర్టిజన్ కార్మికుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడం సరికాదని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ కార్మిక నేత కౌశికహరి మండిపడ్డారు. మల్యాలపల్లి సబ్‌స్టేషన్ వద్ద నిరవధిక సమ్మె చేస్తున్న ఆర్టిజన్లకు గురువారం సంఘీభావం ప్రకటించారు. తమ గోడును రాష్ట్ర ప్రభుత్వానికి వివిధ రకాలుగా వినిపించినా నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తూనే ఉందని తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్స్ ఎంప్లాయీస్ జేఏసీ ఉమ్మడి జిల్లా కన్వీనర్ తూళ్ళ నాగరాజు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి రాగానే ఆర్టిజన్ల డిమాండ్లను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి తుంగలో తొక్కారన్నారని విమర్శించారు. ఆర్టిజన్లు చేపట్టే వివిధ రకాల ఆందోళన కార్యక్రమాలకు బీఆర్‌ఎస్ మద్దతుగా ఉంటుందని చందర్ స్పష్టం చేశారు. కొంకటి శ్రీనివాస్, వడ్డెపల్లి సురేశ్, ఆవుల మహేశ్, మాటూరి రవీందర్, మల్లారపు ప్రభాకర్, రవి, ధర్మానాయక్, లగిశెట్టి మధు, జ్యోతి, కాటం రమేశ్ తదితరులున్నారు.


