న్యూస్‌రీల్
పరిసరాలను శుభ్రం చేస్తున్న ఉద్యోగులు
భగ్గుమంటున్న భానుడు
భానుడు భగ్గుమంటున్నాడు. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇప్పుడే ఇలాఉంటే రానున్న ఎండలను ఊహించుకుని జంకుతున్నారు. ఉక్కపోతకు చిన్నా పెద్ద తేడా లేకుండా అల్లాడుతున్నారు. గురువారం ఎండ తీవ్రతకు పెద్దపల్లిలో వాహనదారులు అవస్థలు పడుతూ, పాదచారులు గొడుగు నీడన ప్రయాణాలు సాగిస్తూ ‘సాక్షి’కి కనిపించారు. కాగా, ఎండ తీవ్రతకు బస్టాండ్, అయ్యప్పగుడి, కూనారం చౌరస్తాల్లో సిగ్నల్స్ వద్ద వేచి ఉండేందుకు వాహనదారులు విసిగిపోయారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి


