‘ఆంధ్రప్రదేశ్‌పై ప్రేమ తెలంగాణపై విషం’ | - | Sakshi
Sakshi News home page

‘ఆంధ్రప్రదేశ్‌పై ప్రేమ తెలంగాణపై విషం’

Apr 9 2026 7:41 AM | Updated on Apr 9 2026 7:41 AM

పెద్దపల్లి: కేంద్రప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌పై ప్రేమ చూపుతూ, తెలంగాణపై విషం కక్కుతోందని ఎంపీ గడ్డం వంశీకృష్ణ విమర్శించారు. కూనారం – పెద్దపల్లి మధ్య చేపట్టిన రైల్వేఫ్లైఓవర్‌ పనులను ఆయన బుధవారం పరిశీలించారు. పనుల్లో వేగం పెంచాల ని సూచించారు. కూనారంతోపాటు కన్నాల, కుందనపల్లి, కొలనూరు ఫ్లైఓవర్ల నిర్మాణానికి నిధుల కోసం పార్లమెంటులో ప్రస్తావించానని అన్నారు. మంచిర్యాల డీసీసీ అధ్యక్షుడు రఘునాథ్‌రెడ్డి, నా యకులు సదానందం, సజ్జత్‌, బండారి సునీల్‌గౌడ్‌, శ్రీనివాస్‌, కనకయ్య, సతీశ్‌ పాల్గొన్నారు.

మరమ్మతులు పూర్తిచేయాలి

ఓదెల: రైల్వేలైన్‌ మరమ్మతులు సత్వరమే పూర్తిచేయాలని ఎంపీ వంశీకృష్ణ సూచించారు. కొలనూర్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలోని లెవల్‌క్రాసింగ్‌ గేట్‌ మరమ్మతులను ఎంపీ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ, పెద్దపల్లి జంక్షన్‌లో సూపర్‌ఫాస్ట్‌ రైళ్ల హాల్టింగ్‌ కోసం కృషి చేశామన్నారు. నాయకులు అల్లం స తీశ్‌, పల్లె ప్రశాంత్‌, మాటురి రవి, శివశంకర్‌, రా జేశం, ఐలయ్యయాదవ్‌, చంద్రయ్య పాల్గొన్నారు. అనంతరం రేషన్‌ షాపులో రేషన్‌ బియాన్ని పంపిణీ చేసి, నూతన వధూవరులను ఆశీర్వదించారు. డీల ర్లు మద్దెల నర్సయ్య, నాగరాజు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement