మట్టి తోడేళ్లు | - | Sakshi
Sakshi News home page

మట్టి తోడేళ్లు

Apr 9 2026 7:41 AM | Updated on Apr 9 2026 7:41 AM

● యథేచ్ఛగా మట్టి అక్రమ తవ్వకాలు, తరలింపు ● కనుమరుగవుతున్న కొండలు, గుట్టలు ● ప్రభుత్వ ఆదాయానికి అక్రమార్కుల గండి ● చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం

సాక్షి, పెద్దపల్లి:

జిల్లాలోని సహజ సంపద తరిగిపోతోంది. అ నుమతి లేకుండా కొండలు, గుట్టలను అక్రమార్కు లు రాత్రి, పగలు తేడా లేకుండా తవ్వేస్తున్నారు. గు ట్టల నుంచి జేసీబీలతో మట్టి తోడి టిప్పర్లు, ట్రా క్టర్లలో నింపి యథేచ్ఛగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. కొందరు అనుమతి పేరిట ఇష్టానుసారంగా తరలిస్తున్నా రు. ఇంత జరుగుతున్నా పోలీస్‌, రెవె న్యూ, మైనింగ్‌ అధికారులు అటువైపు కన్నెత్తి చూడడంలేదు. అసైన్డ్‌, పట్టా భూముల్లో రైతులకు ఎంతోకొంత ముట్టజెప్పి వ్యాపారం దర్జాగా కొనసాగిస్తున్నారు. కొన్నిచోట్ల నామామాత్రంగా మైనింగ్‌ అధికారుల వద్ద అనుమతి తీసుకొని వేల ట్రిప్పులు తోడేస్తున్నా రు. మరికొన్నిచోట్ల ప్రభుత్వ పనుల పేరిట అక్రమంగా తరలిస్తూ సర్కారు ఆదాయానికి గండికొడు తున్నారు. ఓవర్‌లోడ్‌ వాహనాలు తిరగడంతో కొద్దిరోజులకే బీటీ రోడ్లు దెబ్బతింటున్నాయి.

ప్రభుత్వ ఆదాయానికి గండి

అనుమతి తీసుకుంటే రాయల్టీ కింద ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. కానీ, ఇష్టానుసారంగా మట్టి తవ్వి రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు, ఫాంహౌస్‌ లకు ఒక్కో ట్రిప్పును రూ.3 వేల నుంచి రూ.5వేల వరకు విక్రయిస్తూ రూ.లక్షలు గడిస్తున్నారు. అధికారుల కళ్లెదుటే ఇంత జరుగుతున్నా పట్టించుకోవ డం లేదని విమర్శలు వస్తున్నాయి. మట్టి దందాపై తహసీల్దార్‌, మైనింగ్‌ అధికారుల వివరణ కోరగా.. అక్రమంగా మట్టి తరలిస్తున్నట్లు తమ దృష్టికి రాలేదన్నారు. అనుమతి లేకుండా మట్టి తవ్వకాలు చేపడితే జేసీబీ, ట్రాక్టర్‌లను సీజ్‌ చేస్తామని తెలిపారు.

ఈ గుట్ట పెద్దపల్లి మండలం రాంపల్లి శివారులోనిది. అనుమతి లేకుండానే జేసీబీలతో మట్టి తవ్వుతూ ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. తుర్కలమద్దికుంట, పాలితం, ర్యాకల్‌దేవ్‌పల్లి, కొదురుపాక, కాట్నపల్లి, గర్రెపల్లి, కనగర్తి, శానగొండ, వెన్నంపల్లి, చిన్నరాతుపల్లి, పెద్దరాతుపల్లి, రాఘవాపూర్‌, బూర్హాన్‌మియాపేట, శివపల్లి, చీమలపేట, తెలుకుంట తదితర గ్రామాల్లోనూ మట్టి దందా ఇలాగే యథేచ్ఛగా సాగుతోంది. అయినా, ఎవరూ పట్టించుకోవడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement