క్రిటికల్‌ కేర్‌ సెంటర్‌తో విశేష సేవలు | - | Sakshi
Sakshi News home page

క్రిటికల్‌ కేర్‌ సెంటర్‌తో విశేష సేవలు

Apr 9 2026 7:41 AM | Updated on Apr 9 2026 7:41 AM

● రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ ● క్రిటికల్‌ కేర్‌ భవనం ప్రారంభం

కోల్‌సిటీ(రామగుండం): నగరంలో క్రిటికల్‌ కేర్‌ సెంటర్‌ అందుబాటులోకి రావడం ద్వారా ప్రజల కు విశేష సేవలు అందుతాయని రామగుండం ఎ మ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ అన్నారు. ప్రభు త్వ సహకారంతోనే చిన్నఆస్పత్రి నుంచి బోధనా స్పత్రి వరకు గోదావరిఖని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి అభివృద్ధి చెందిందన్నారు. రూ.23.75కోట్ల వ్య యంతో నిర్మించిన క్రిటికల్‌ కేర్‌ భవనాన్ని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష, మేయర్‌ మహంకాళి స్వామితో కలి సి ఎమ్మెల్యే బుధవారం ప్రారంభించి మాట్లాడారు. దివంగత సీఎం డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి హ యాంలోనే చిన్న ఆస్పత్రి ప్రారంభించారని గుర్తుచే శారు. కలెక్టర్‌ శ్రీహర్ష, డిప్యూటీ మేయర్‌ పాతిపెల్లి ఎల్లయ్య, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ దయాళ్‌సింగ్‌, డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్‌, డాక్టర్లు హిమబిందు, అరుణ తదితరులు పాల్గొన్నారు.

అన్నివర్గాలకు సంక్షేమ ఫలాలు

గోదావరిఖని: సంక్షేమ పథకాల ఫలాలు అన్నివర్గా లకు అందుతున్నాయని ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ అ న్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దివ్యాంగులకు 18 స్కూటీలు, విద్యార్థులకు 7 ల్యాప్‌ట్యా ప్‌లు, 203 మంది అంగన్‌వాడీ టీచర్లకు 5జీ మొబైల్‌ఫోన్‌లు, 2ట్యాబ్‌లు అందజేసి మాట్లాడారు. మేయర్‌ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్‌ పాతిపెల్లి ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మార్సీ భవనం ప్రారంభం

రామగుండం: అంతర్గాం ఎమ్మార్సీ భవనాన్ని ఎ మ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ ఎంఈవో సంగీతతో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ అంగోతు రవికుమార్‌, హెచ్‌ఎం ఏకాంబరం, పీఈటీ శోభారాణి, ఎమ్మార్సీ సహాయకుడు రేగొండ శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement