పెద్దపల్లి: పెండింగ్ కేసుల పరిష్కారంలో పోలీస్‌ల పాత్ర కీలకమని జిల్లా న్యాయమూర్తి కుంచాల సునీత అన్నారు. గతనెలలో నిర్వహించిన లోక్ అదాలత్‌ను విజయవంతం చేయడంలో పోలీసుల పాత్రపై జిల్లా కేంద్రంలో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడు తూ, పరస్పర అవగాహనతో త్వరితగతిన కేసులు పరిష్కరించడంలో పోలీస్ శాఖ సమర్థవంతంగాపనిచేసిందన్నారు. భవిష్యత్‌లో కూడా ఇలాగే సేవలు అందించాలని సూచించారు. డీసీపీ రాంరెడ్డి మాట్లాడారు. లోక్ అదాలత్ నిర్వహణలో కీలకపాత్ర పో షించిన పోలీసు అధికారులు, సిబ్బందికి ప్రశంసపత్రాలను జిల్లా న్యాయమూర్తి అందజేశారు. ఈ కా ర్యక్రమంలో జిల్లా అదనపు జడ్జి, స్వప్నరాణి, లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి భావాని, జూనియర్ సివిల్ జడ్జి, మంజుల, పెద్దపల్లి, గోదావరిఖని ఏిసీపీలు రమేశ్, కృష్ణ, సీఐలు ప్రవీణ్ కుమార్, రాజుగౌడ్, రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.


