పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం | - | Sakshi
Sakshi News home page

పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం

Apr 9 2026 7:41 AM | Updated on Apr 9 2026 7:41 AM

● జిల్లా ఆస్పత్రికి అవార్డులు రావడం అభినందనీయం ● ప్రభుత్వ విప్‌ విజయరమణారావు

పెద్దపల్లిరూరల్‌: ‘నేను పోత బిడ్డో సర్కారు దవాఖానాకు’ అంటూ అన్ని ప్రాంతాల ప్రజలు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చి వైద్యసేవలు పొందుతున్నారని, రోజు సుమారు వెయ్యి మంది చికిత్స పొందడం ఇందుకు నిదర్శనమని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రి అందిస్తున్న వైద్యసేవలకు గుర్తింపుగా నాలుగు రాష్ట్రస్థాయి అవార్డులు సాధించిన వైద్యాధికారులు, సిబ్బందిని ఎమ్మెల్యే అభినందించారు. తన క్యాంపు కార్యాలయంలో బుధవా రం సూపరింటెండ్‌ శ్రీధర్‌, మున్సిపల్‌ చైర్మన్‌ నూగి ల్ల మల్లయ్యతో కలిసి విలేకరులతో మాట్లాడారు. కొత్త భవనం వచ్చే ఏడాది అందుబాటులోకి వస్తుందని, ఆలోగా జిల్లా ఆస్పత్రిలో అన్నిరకాల ఆధునిక వైద్యసేవలు, పరీక్షలు అందుబాటులోకి తీసుకొస్తా మని తెలిపారు. డాక్టర్‌ శ్రీధర్‌ పర్యవేక్షణలో వైద్యు లు, సిబ్బంది సేవలకుతోడు వసతుల కల్పన, మందుల లభ్యత తదితర అంశాలపై కలెక్టర్‌ శ్రీహర్ష, తాను పర్యవేక్షిస్తున్నామని వివరించారు. ప్రభుత్వాస్పత్రిపై ప్రజల్లో నమ్మకం పెరిగిందని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement