రజకుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

రజకుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

Apr 9 2026 7:41 AM | Updated on Apr 9 2026 7:41 AM

రామగిరి: రజకుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రజా ప్రభుత్వం ఎల్లప్పుడూ రజకులకు అండగా ఉంటుందని కమాన్‌పూర్‌ ఏఎంసీ చైర్మన్‌ వైనాల రాజు అన్నారు. మండలంలోని సెంటినరికాలనీలో రజకులకు స్థలం కేటాయించినందుకు బుధవారం మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఏఎంసీ డైరెక్టర్‌ ప్రవీణ్‌నాయక్‌, మాజీ జెడ్పీటీసీ గంట వెంకటరమణారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు తోట చంద్రయ్య, నాయకులు ఆరెల్లి కొమురయ్యగౌడ్‌, ముస్త్యాల శ్రీనివాస్‌, కాటం సత్యం, అవినాష్‌, రజక సంఘం నాయకులు ధర్ముల రాజయ్య, పున్నం సమ్మయ్య, కొత్తపల్లి రాజమల్లు, నల్లూరి లింగయ్య, మాదాసి శ్రీనివాస్‌, బండి రంజిత్‌ కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement