రామగిరి: ఎండలు తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రయాణికులు, బాటసారులకు తాగునీరు సౌకర్యం కల్పించేందుకు ఆయా గ్రామాల్లో చలివేంద్రాలుఏర్పాటు చేసినట్లు ఎంపీడీవో శైలజారాణి తెలిపారు. జెడ్పీ సీఈవో, డీపీవో ఆదేశాల మేరకు మండలంలోని లద్నాపూర్, ఆదివారంపేట, బుధవారంపేట, నవాబ్‌పేట, రత్నపూర్ గ్రామాల పరిధిలోని బస్టాండ్‌లు, రహదారి పక్కన, గ్రామ కూడళ్ల వద్ద బుధవారం చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. సర్పంచులు పల్లె ప్రతిమ పీవీరావ్, వనం రాంచందర్‌రావు, కార్యదర్శులు పాల్గొన్నారు.


