సమాజానికి చేసిన సేవలే చిరస్థాయిగా మిగులుతాయి | - | Sakshi
Sakshi News home page

సమాజానికి చేసిన సేవలే చిరస్థాయిగా మిగులుతాయి

Apr 9 2026 7:41 AM | Updated on Apr 9 2026 7:41 AM

మంథనిరూరల్‌: సమాజానికి చేసిన సేవలే చిరస్థాయి జ్ఞాపకాలుగా మిగిలిపోతాయని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. మంథని మండలం చిల్లపల్లికి చెందిన మాజీ ఎంపీటీసీ పిక్కల పెద్ద రాజయ్య ప్రథమ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఆయన విగ్రహాన్ని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌తో కలిసి మాజీ మంత్రి ఆవిష్కరించారు. పెద్ద రాజయ్య ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ ముందుకు రావాలని వారు పిలుపునిచ్చారు. నాయకులు తగరం శంకర్‌లాల్‌, ఏగోళపు శంకర్‌గౌడ్‌, పిక్కల రాజయ్యతో పాటు రాజయ్య కుటుంబసభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement