బోసిపోయి కనిపిస్తున్న డిప్యూటీ తహసీల్దార్ కుర్చీ
ఖాళీగా ఉన్న తహసీల్దార్ కుర్చీ
జ్యోతినగర్: పెద్దపల్లి జిల్లా రామగుండం తహసీల్దార్ కార్యాలయం పక్షంరోజులుగా అధికారులు లేక బోసిపోయి కనిపిస్తోంది. మొన్నటివరకు పనిచేసిన ఇన్‌చార్జి తహసీల్దార్ శ్రీపాద ఈశ్వర్‌తోపాటు డిప్యూటీ తహసీల్దార్ ఇటీవల బదిలీపై వెళ్లారు. ఆర్‌ఐలు సెలవులో ఉన్నారు. ఇందుకు కారణాలపై అనేక ఊహాగానాలు వస్తున్నాయి. రాజకీయ ఒత్తిళ్లా? కార్యాలయంలో చోటుచేసుకుంటున్న మానసిక పరిస్థితుల ప్రభావమా? అనేది తెలియడం లేదని అర్బన్ మండలవాసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడకు బదిలీపై వచ్చేందుకు పలువురు తహసీల్దార్లు జంకుతున్నారని తెలిసింది. జీపీవోలు, కంప్యూటర్ ఆపరేటర్లు, సిబ్బంది మినహా కీలకమైన కులం, ఆదాయం, నివాసం తదితర ధ్రువీకరణపత్రాల జారీకోసం సంతకం చేసే అధికారులు లేక వందలాది మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్‌లను తక్షణమే నియమించేలా కలెక్టర్ చొరవ తీసుకోవాలని నేషనల్ యూత్ ప్రాజెక్టు రాష్ట్ర అధ్యక్షుడు కె.యాదవరాజు కోరారు.
అధికారులు లేక ఖాళీగా తహసీల్దార్ కార్యాలయం


