రామగుండం: ఆర్టిజన్ల కార్మికుల డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో యాజమాన్యం జరిపిన చర్చల్లో స్పందన లేకపోవడంతో బుధవారం నుంచి తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జేఏసీ పిలుపు మేరకు నిరవధిక సమ్మె చేపట్టారు. మల్యాలపల్లి సబ్‌స్టేషన్ ప్రాంగణంలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ప్లకార్డులతో ఆర్టిజన్లు నినాదాలు చేసి విధులకు దూరంగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇదే నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని వారు పేర్కొన్నారు. సమ్మెలో జేఏసీ ప్రతినిధులు కొంకటి శ్రీనివాస్, వడ్డెపల్లి సురేశ్, ఆవుల మహేశ్, దుర్గం విశ్వనాథ్, ఖలీద్, మల్లారపు ప్రభాకర్, రవి, ధర్మానాయక్, కిరణ్, సందీప్, శ్రీనాథ్ పాల్గొన్నారు.


