యైటింక్లయిన్‌కాలనీ: రామగుండం కార్పొరేషన్ యైటింక్లయిన్‌కాలనీ 19వ డివిజన్ ఏరియాలో కనకలక్ష్మికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాగా బుధవారం డివిజన్ కార్పొరేటర్ మారెల్లి సుశీల–రాజిరెడ్డి భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. కార్పొరేటర్ మాట్లాడుతూ డివిజన్ ఏరియాలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు వచ్చేలా చూస్తామని పేర్కొన్నారు. అల్లూరు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో వంటగది లేకపోవడంతో విషయని తెలుసుకున్న కార్పొరేటర్ రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఎమ్మెల్యే వంటగది నిర్మాణం, మెయింటెన్స్ కోసం రూ.15లక్షల నిధులు మంజూరు చేయించారు. దీంతో బుధవారం పాఠశాలలో వంటగది నిర్మాణానికి భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. డివిజన్ అధ్యక్షులు మార్క రాజు, రాకేశ్, అజయ్, కనకయ్య, రాజు, శ్రీనివాస్, అరుణ్, నాగరాజు, అంజి, విజయ్ పాల్గొన్నారు.


