ఓపికగా విని.. పరిష్కార మార్గం చూపి..
పెద్దపల్లి: దరఖాస్తుదారుల సమస్యలు ఓపిగ్గా వి న్న కలెక్టర్ కోయ శ్రీహర్ష.. వాటికి సత్వరమే పరి ష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్ వేణు, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ వనజతో కలిసి కలెక్టరేట్‌లో సోమవారం ప్రజావాణి ద్వారా ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. సుల్తానాబాద్‌కు చెందిన ఎండీ షజానా బేగం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని, ధర్మారం మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన కె.మల్లయ్య.. సర్వే నంబర్ 723లోని 1.39 ఎకరాలను భూభారతిలో నమోదు చేయాలని, పెద్దపల్లి మండలం చింతపల్లి గ్రామానికి చెందిన మదన వెంకటరమణమ్మ.. తన భర్త మరణించి మూడేళ్లవుతోందని, ఇ ప్పటివరకు వితంతు పింఛన్ మంజూరు కాలేదని, ధర్మారం మండలం నందిమేడారం గ్రామానికి చెందిన శంకరయ్య.. తన కుమారులు పోషించడం లేదని, తనను ఆదుకోవాలని ప్రజావాణి ద్వారా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన శ్రీహర్ష.. వాటిని సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు.
శ్మశానవాటికను అభివృద్ధి చేయాలి
పెద్దపల్లిలోని సుభాష్‌నగర్, రంగంపల్లి, విష్ణుపూర్‌కాలనీ, ఆదర్శనగర్ ప్రాంతవాసులు కలెక్టర్‌ను కలిసి.. మామిడికుంట కట్ట వద్ద సర్వే నంబర్‌లోని స్థలాన్ని అభివృద్ధి చేయాలని విన్నవించారు.
నాణ్యమైన ధాన్యం తీసుకు రావాలి
కొనుగోలు కేంద్రాలకు నాణ్యమైన ధాన్యం తీసుకెళ్తే వెంటనే కొనుగోలు చేసి రైస్ మిల్లులకు తరలిస్తారని కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. ధాన్యం కొనుగోళ్లు, ఆయిల్‌పామ్ సాగు తదితర అంశాలపై అధికారులతో ఆయన సమీక్షించారు. సహకార సంఘా లు ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహించాలని కలెక్టర్ సూచించారు. అనంతరం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నా రు. జిల్లా పౌరసరఫరాల అధికారి శ్రీనాథ్, మేనేజర్ శ్రీకాంత్, జెడ్పీ సీఈవో నరేందర్, జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాస్, సహకార అధికారి శ్రీమాల, ఉద్యాన అధికారి జగన్మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.


