కనులపండువగా నృసింహుని రథోత్సవం
పెద్దపల్లిరూరల్: దేవునిపల్లి శ్రీలక్ష్మీనర్సింహస్వామి రథోత్సవం సోమవారం కన్నులపండువగా నిర్వ హించారు. ఈనెల 2న స్వామి వారి బ్రహ్మోత్సవా లు ప్రారంభమయ్యాయి. చివరిరోజు ఉదయం 5.45గంటలకు రథోత్సవం నిర్వహించారు. వివిధ ప్రాంతాలకు చెందిన వేలాది మంది భక్తులు తరలివచ్చారు. వైద్యబృందం సేవలందించారు. ఏసీపీ కృష్ణ, సీఐ ప్రవీణ్‌కమార్, రూరల్ ఎస్సై మల్లేశ్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఎమ్మెల్యే విజయరమణారావు సతీమణి పావని స్వామివారిని దర్శించుకున్నారు.
గ్రామస్తులు, భక్తులకు తప్పని అవస్థలు..
రథోత్సవం సందర్భంగా పోలీసుల తీరును గ్రామస్తులు, భక్తులు ఆక్షేపించారు. పోలీసుల ఆంక్షలతో అనేక ఇబ్బందులు పడ్డామని గ్రామస్తులు ఆరోపించారు. సుదూర ప్రాంతాల నుంచి పిల్లాపాపలతో తరలివచ్చిన భక్తులు ఆలయానికి చేరుకునేందుకు అపసోపాలు పడాల్సివచ్చింది. ఆదివారమే అధిక సంఖ్యల తరలివచ్చిన భక్తజనం.. స్వామివారిని దర్శించుకున్నారు. సోమవారం అంతంత మాత్రంగానే ఉన్నా పోలీసు అధికారులు ఆంక్షలు విధించడం సరికాదని అసహనం వ్యక్తం చేశారు.
గుట్టపై పూజలు..
గుట్టపై వెలసిన మూలవిరాట్టుకు పూజలు చేసేందుకు భక్తులు మెట్లమార్గంలో తరలివెళ్లారు. మంగళవారం స్వామివారికి నిత్యార్చన, చక్రస్నానం(చక్రతీర్థం), పంచామృత మహాకుంభాభిషేకం నిర్వహించడంతో ఉత్సవాలు ముగుస్తాయని ఆలయ ఈవో ముద్దసాని శంకరయ్య తెలిపారు.
కనులపండువగా నృసింహుని రథోత్సవం
కనులపండువగా నృసింహుని రథోత్సవం


