చెత్త బయట పడేయొద్దు
కోల్‌సిటీ(రామగుండం): నిషేధిత ప్లాస్టిక్ విని యోగించినా, అపరిశుభ్ర వాతావరణంలో ప దార్థాలు తయారు చేసి విక్రయించినా, చెత్త బ యట పడవేసినా జరిమానా విధించాలని రా మగుండం నగరపాలక సంస్థ కమిషనర్ అరు ణశ్రీ ఆదేశించారు. బల్దియా కార్యాలయంలో సోమవారం పారిశుధ్య సిబ్బందితో పరిసరాల పరిశుభ్రతపై సమీక్షించారు. తడిచెత్తను కంపో స్ట్ యార్డ్‌కు తరలించాలన్నారు. ప్రభుత్వ వి ద్యాసంస్థ, వసతి గృహాల్లో పారిశుధ్య పనులు చేపట్టాలని సూచించారు. అడిషనల్ కమిషనర్ మారుతీప్రసాద్, కార్యదర్శి ఉమామహేశ్వర్‌రా వు, శానిటరీ ఇన్‌స్పెక్టర్ నాగభూషణం, జవా న్లు, మెప్మా టీఎంసీ మౌనిక పాల్గొన్నారు.
క్రీడలపై ఆసక్తి పెంచాలి
పెద్దపల్లి: విద్యార్థి దశనుంచే క్రీడలపై ఆసక్తి పెంచేలా పీఈటీలు కృషి చేయాలని డీవైఎస్‌వో సురేశ్ సూచించారు. సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి ప్రభుత్వ హైస్కూల్‌లో సోమవారం ఎస్జీఎఫ్ –14 బాలబాలికల ఉమ్మడి జిల్లా వాలీబాల్ పోటీలు నిర్వహించారు. ఆయన మాట్లా డుతూ ప్రపంచస్థాయి ఆర్చరీ పోటీల్లో గోల్డ్‌మె డల్ సాధించిన చికితను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఎంపీడీవో దివ్యదర్శనరావు, ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి లక్ష్మణ్, ఆసంపల్లి ల క్ష్మీ ఫౌండేషన్ చైర్మన్ ఆసంపల్లి శ్రీనివాస్, ఉపాధ్యాయురాలు కవిత, పెటా జిల్లా కార్యదర్శి రమేశ్, మండల కార్యదర్శి ప్రణయ్ ఉన్నారు.
కెపాసిటర్లు బిగించుకోవాలి
పెద్దపల్లిరూరల్: సాగుకు అవసరమైన విద్యుత్ వినియోగించే రైతులు వచ్చే యాసంగి సీజన్ లో లో వోల్టేజీ సమస్యను అధిగమించేందుకు మీటర్లకు కెపాసిటర్లను అమర్చుకోవాలని డీ ఈటీ బాలయ్య సూచించారు. మూలసాలలో సోమవారం ట్రాన్స్‌ఫార్మర్‌కు అమర్చిన కెపాసిటర్‌ను ఆయన ప్రారంభించారు. విద్యుత్ సమస్యలు ఏర్పడితే రైతులు నేరుగా పరిష్కరించవద్దని, టోల్‌ఫ్రీ నంబరు 1912కు సమాచారం అందిస్తే పరిష్కరిస్తామని తెలిపారు. డీఈ తిరుపతి, ప్రతినిధులు సంపత్, రాజ్‌కుమార్, రజనీకాంత్, సంపత్, మహేందర్ పాల్గొన్నారు.
క్వింటాల్ పత్తి రూ.6,762
పెద్దపల్లిరూరల్: స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డులో సోమవారం పత్తి క్వింటాల్‌కు గరిష్టంగా రూ.6,762 ధర నమోదైంది. కనిష్ట ధర రూ.5,051గా, సగటు ధర రూ.6,411గా ఉందని మార్కెట్ కార్యదర్శి మనోహర్ తెలిపారు. 1,648 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేశారు.
రామగిరి(మంథని): మంథని జేఎన్టీయూలో సోమవారం జాతీయ స్థాయి మెకానికల్ ఐవో టీ వర్క్‌షాప్ నిర్వహించారు. రెండురోజుల పాటు జరిగే వర్క్‌షాప్‌ను ప్రిన్సిపాల్ విష్ణువర్ధ న్ ప్రారంభించారు. తృతీయ సంవత్సరం మె కానికల్ విద్యార్థులు వైజాగ్‌కు చెందిన టెకిబో ట్ సంస్థ సాయంతో ఈ కార్యక్రమం చేపట్టా రు. తొలిరోజు డిస్టెన్స్ మానిటరింగ్, హోం ఆ టోమేషన్, రిలేకంట్రోల్ యూజింగ్ డాష్ బో ర్డు, రిఫ్రిజిరేషన్ సిస్టం, స్మార్ట్ ఫ్యాన్ కంట్రోల్ థ్రూ టెంపరేచర్ మానిటరింగ్ ప్రాజెక్టుల థియరీల గురించి వివరించారు. వైస్ ప్రిన్సిపాల్ ఉదయకుమార్, కన్వీనర్ శివరామకృష్ణ, ఫ్యాకల్టీ సలహాదారులు స్వప్న, మధు, టెకిబోట్ సీఈవో వెంకట్రెడ్డి, ట్రెయినర్లు జ్యోష్ని, చరణ్, స్టూడెంట్ కో ఆర్డినేటర్స్ ఫిరోజ్, ధన్రాజ్, మేఘన, గోవర్ధన్, త్రిష పాల్గొన్నారు.
కుందనపల్లివాసుల ధర్నా
గోదావరిఖని: బూడిత తరలిస్తూ ఇబ్బందుల కు గురిచేస్తున్న కాంట్రాక్టర్‌పై చర్య తీసుకో వా లని కుందనపల్లి గ్రామస్తులు సోమవారం స్థా నిక ఆర్జీ వన్ జీఎం కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. సింగరేణిలో పనిచేస్తూ బినామీ కాంట్రాక్టు పొంది పదేళ్లుగా బూడిద చెరువు నుంచి బూడిద తరలిస్తున్నారని ఆరోపించారు. సంగె న శేఖర్, జక్కుల నారాయణ, మేకల స్వామి, బుర్ర వెంకటస్వామి, శ్రీనివాస్, రవి ఉన్నారు.
చెత్త బయట పడేయొద్దు
చెత్త బయట పడేయొద్దు
చెత్త బయట పడేయొద్దు


