కౌన్సెలింగ్ కత్తి
నెలలో 16 మస్టర్ల కన్నా తక్కువ ఉండే కార్మికులపై ఫోకస్ ఏడాదిలో 150 మస్టర్లు చేస్తేనే ఉద్యోగానికి భరోసా బొగ్గు గనులపై మొదలైన నెలవారీ సూచనలు, సలహాలు
గతంలో ఏడాదికి భూగర్భ గనిలో వంద, సర్ఫేస్‌లో 150 మస్టర్లు చేయాలనే నిబంధన ఉండేది. నెలలో కనీస మస్టర్లు చేయాలనే నిబంధనేదీలేదు.
ప్రస్తుతం నెలకు భూగర్భ గనిలో 16, సర్ఫేస్‌లో 20 మస్టర్లు తప్పకుండా చేయాలనే నిబంధన అలమలులోకి వచ్చింది.
గోదావరిఖని: సింగరేణి కార్మికుల మెడపై గైర్హాజర్ కత్తి వేలాడుతోంది. గతంలో మాదిరిగా ఇష్టానుసారంగా డ్యూటీకి డుమ్మా కొడతామంటే కుదరదు. నె లలో కనీసం 16 మస్టర్లు డ్యూటీ చేయాల్సిందే. లేనిపక్షంలో అధికారుల కౌన్సెలింగ్ ఎదుర్కోవాల్సిందే.
విచారణ ఎదుర్కోవాల్సిందే..
ఏడాదిలో కనీసం 150 మస్టర్ల కన్నా తక్కువ ఉంటే విచారణ ఎదుర్కొనేలా సింగరేణి నిబంధనలు రూ పొందించింది. కానీ, కార్మికుల గైర్హాజర్ పెరగడంతో బొగ్గు ఉత్పత్తిపై ప్రభావం పడుతోంది. సంస్థలో ప్రతీనెల 25శాతం కార్మికులు విధులకు గైర్హాజరవుతున్నారని, ఇందులో అధికంగా యువకార్మికులే ఉంటున్నారని గుర్తించింది. గైర్హాజర్ నివారణకు నెలలో కనీసం 16 మస్టర్ల కన్నా తక్కువ మస్టర్లు ఉంటే గనులపైనే కౌన్సెలింగ్ చేయాలని నిర్ణయించింది. ఈపక్రియ ఈనెలలోనే ప్రారంభమైంది.
ప్రారంభమైన కౌన్సెలింగ్ ప్రక్రియ
గైర్హాజర్ కార్మికులకు నాలుగు రోజుల క్రితమే కౌన్సెలింగ్ ప్రారంభమైంది. భూగర్భగనుల్లో నెలకు 16 కన్నా తక్కువ, ఉపరితంలో 20 మస్టర్ల కన్నా తక్కువ ఉంటే గనిపై చేపట్టే కౌన్సెలింగ్‌కు హాజరు కావాల్సిందే. భూగర్భగనుల్లో మూడునెలల పాటు ఇదేవిధంగా హాజరు ఉంటే గని మేనేజర్ స్థాయి, మూడునెలల తర్వాత ఏరియాస్థాయి కమిటీకి పంపిస్తారు. గైర్హాజరవుతూ కౌన్సెలింగ్‌కు హాజరు కుంటే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు.
మూడున్నర నెలల్లో ఇంటికే..
ఏడాదిలో కనీసం 150 డ్యూటీలు చేయాలని, అంతకన్నా తక్కువ ఉన్న కార్మికుల జాబితాను గనుల నోటీసు బోర్డుపై అంటించాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. అవసరమైతే హెచ్చరిక, సస్పెన్షన్, నాన్‌క్యూమిలేటివ్ ఇంక్రిమెంట్ రికవరీ, క్యూమిలేటివ్ ఇంక్రిమెంట్(జీవితకాలం) తక్కువ, గ్రేడ్ తగ్గించడం, తర్వాత డిస్మిస్ చేయడం.. ఇలా క్రమశిక్షణ చర్యల ప్రక్రియ మూడు నెలల్లో పూర్తిచేయాలని కార్పొరేట్ నుంచి ఆదేశాలు వచ్చాయి.
క్లరికల్ సిబ్బందిపై భారం
నెలవారీ కౌన్సెలింగ్‌తో పేషీట్ రైటర్, పీవోఏ, ఎంకై ్వరీ క్లర్క్, వెల్ఫేర్ ఆఫీసర్, జీఎం ఆఫీస్ నుంచి విచారణ ఆఫీసర్ రావాలి. గతంలో ఆరు నెలలకోసారి కౌన్సెలింగ్ నిర్వహించగా, ప్రస్తుతం నెలకోసారి చేపట్టడం అందరికీ తలకు మించిన భారంగా మారుతుందని అంటున్నారు.
గైర్హాజర్ లెక్కింపు ఇలా..


