
పార్టీ కోసం కష్టించే వారికి పదవులు
● ఏఐసీసీ అబ్జర్వర్ జయకుమార్
గోదావరిఖని(రామగుండం): పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నామని ఏఐసీసీ అబ్జర్వర్ జయకుమార్ పేర్కొన్నారు. గురువారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి పాలనపై ప్రజల్లో సానుకూలత వ్యక్తమవుతోందన్నారు. పార్టీ కోసం కష్టించే వారికి జిల్లా అధ్యక్ష, కార్పొరేషన్ అధ్యక్ష పదవికి ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. పదవుల కోసం పోటీపడే వారి నుంచి ఈనెల19 వరకు దరఖాస్తులు స్వీకరించి, 22న పార్టీ పెద్దలకు అప్పగించనున్నట్లు పేర్కొన్నారు. పీసీసీ అబ్జర్వర్ కేతురీ వెంకటేశ్, టీపీసీసీ ప్రధానకార్యదర్శి కాశిపాక రాజేశ్, ప్రొటోకాల్ కోఆర్డినేటర్ బాషిత్, నాయకులు బొంతల రాజేశ్, మహంకాళి స్వామి, తిప్పారపు శ్రీనివాస్, పెద్దెల్లి ప్రకాశ్, కాల్వ లింగస్వామి, ఆసిఫ్‌పాషా, అనుమ సత్యనారాయణ, బొమ్మక రాజేశ్, బెంద్రం రాజిరెడ్డి, గట్ల రమేశ్, యుగేందర్, మోహిద్ సన్నీ తదితరులు పాల్గొన్నారు.