
స్వేచ్ఛను హరించే కుట్ర
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను హరించే కుట్ర చేస్తున్నది. ప్రజల పక్షాన వార్తలు ప్రచురి స్తు న్న సాక్షి దినపత్రిక ఎడిటర్, జర్నలిస్టులపై ఏపీ కూటమి ప్రభుత్వం కేసులు నమోదు చేయడం సిగ్గుచేటు. దీనిని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. పత్రికా స్వేచ్ఛకు గోడ్డలి పెట్టుగా భావిస్తున్నాం. ప్రభుత్వం తీరుమార్చుకోవాల్సిందే.
– కల్లేపల్లి అశోక్, ఎస్‌ఎఫ్‌ఐ నేత, పెద్దపల్లి
కక్ష సాధింపు సరికాదు
ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టే ట్ కీలకం. పత్రిక ప్రతిపక్ష పాత్ర పోషిస్తే హర్షించాలి కానీ, అక్రమ కేసులు, వేధింపులు ఏ ప్రభుత్వానికీ మంచివికాదు. కేసులతో భయపెట్టి అడ్డులేకుండా చూసుకోవాలని చూస్తున్నట్లు కనబడుతుంది. భావప్రకటనా స్వేచ్ఛను హరించే విధానాలకు స్పస్తి చెప్పాలి. పాత్రికేయులు, పత్రికకు అండగా ఉంటాం. – తాండ్ర సదానందం,
సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి, సీపీఐ
పరత్రిక గొంతు నొక్కితే పతనం తప్పదు
రాజకీయ కక్షతో సాక్షి దినపత్రిక గొంతు నొక్కాలని చూస్తే పతనం తప్పదు. ప్రభుత్వ తీరును ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ప్రజాస్వామ్యంలో పత్రికలే ప్రజల గొంతుకగా పనిచేస్తాయి. దాడులను అందరూ ఖండించాల్సిందే.
– రాజోజుల శివకుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీఆర్‌ఎస్‌వీ

స్వేచ్ఛను హరించే కుట్ర

స్వేచ్ఛను హరించే కుట్ర