
బీసీ సంఘాల బంద్‌కు కాంగ్రెస్ మద్దతు
● పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సౌకర్యం కల్పిలంచాలనే డిమాండ్‌తో ఈనెల 18న చేపట్టిన రాష్ట్రబంద్‌కు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని పెద్దపల్లి ఎ మ్మెల్యే విజయరమణారావు స్పష్టం చేశారు. పెగడపల్లిలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉద్యోగ, విద్య, రాజకీయ రంగాల్లో బీసీలకు అవకాశాలు పెరిగాయన్నారు. కులగణన నిర్వహించిన ఘనత సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీకే దక్కిందన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌లు బీసీ రి జర్వేషన్లకు సుముఖంగా లేవని విమర్శించారు. బీ సీలపై ఆ రెండు పార్టీలు పక్షపాత వైఖరి అవలంబిస్తున్నాయన్నారు. ఈక్రమంలో బీసీ సంఘాలు చేపట్టిన రాష్ట్రబంద్‌కు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు మద్దతుగా ఆందోళనలో పాల్గొనాలని ఆయన కోరారు. ఈసమావేశంలో మాజీ ఎంపీపీ సారయ్యగౌడ్, ఏఎంసీ చైర్మన్ రామి డి తిరుపతిరెడ్డి, వైస్ చైర్మన్ సబ్బని రాజమల్లు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గాజనవేన సదయ్య, మా జీ జెడ్పీటీసీ లంక సదయ్య, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.