పత్రికా స్వేచ్ఛను హరిస్తారా? | - | Sakshi
Sakshi News home page

పత్రికా స్వేచ్ఛను హరిస్తారా?

Oct 18 2025 6:59 AM | Updated on Oct 18 2025 6:59 AM

పత్రి

పత్రికా స్వేచ్ఛను హరిస్తారా?

సర్కారు తీరు ప్రజాస్వామ్యానికి చేటు పెద్దపల్లి ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడు గుడ్ల శ్రీనివాస్‌, జర్నలిస్టులు ‘సాక్షి’ ఎడిటర్‌పై వేధింపులకు నిరసన ప్రెస్‌క్లబ్‌ ఆధ్వర్యంలో ఆందోళన వామపక్ష పార్టీలు, బీఆర్‌ఎస్‌ మద్దతు

పెద్దపల్లి: పత్రికలు స్వేచ్ఛగా పనిచేస్తేనే ప్రజాస్వామ్యానికి మనుగడ ఉంటుందని, స్వేచ్ఛకు సంకెళ్లు వేస్తే ప్రజాస్వామ్యానికి చేటు చేసినట్లేనని పెద్దపల్లి ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడు గుడ్ల శ్రీనివాస్‌ అన్నారు. ‘సాక్షి’ ఎడిటర్‌ ధనంజయరెడ్డి, జర్నలిస్టులపై ఆంధ్రప్రదేశ్‌ పోలీసుల వేధింపులు, అక్రమ కేసుల నమోదుకు నిరసనగా జిల్లా కేంద్రంలోని తెలంగాణ అమరవీరుల స్తూపం నుంచి అంబేడ్కర్‌ విగ్రహం వరకు శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్‌ సమీపంలో రాజీవ్‌ రహదారిపై ప్రజాసంఘాలతో కలిసి నిరసన తెలిపారు. శ్రీనివాస్‌ మాట్లాడుతూ, విమర్శనాత్మక, స్వతంత్ర, పరిశోధనాత్మక కథనాలు ప్రజాస్వామిక రాజ్యానికి జీవనాడిలాంటివని నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత నెల్సన్‌ మండేలా చెప్పారని గుర్తుచేశారు. ప్రజాస్వామ్యానికి మూలస్తంభాల్లో ఒకటైన ఫోర్త్‌ ఎస్టేట్‌ మీడియా ప్రతిపక్ష పాత్ర పోషించడం సర్వసాధారణమని ఆయన అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతున్నారనే కక్షతోనే ‘సాక్షి’పై కత్తిగట్టారని విమర్శించారు. సమాజంలోని వివిధ అంశాలపై పత్రికలు కథనాలు ప్రచురిస్తాయని, అభ్యంతరాలు ఉంటే వివరణ ఇవ్వాలే తప్ప కేసులు బనాయించి బెదిరించడం పత్రికా స్వేచ్ఛను హరించడమేనన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న ధోరణి హిట్లర్‌, ముస్సోలిని లాంటి నియంత పోకడలను తలపిస్తోందని ఆయన ధ్వజమెత్తారు. ఏపీ ప్ర భుత్వ వైఖరిని ప్రజాస్వామ్యవాదులు ఖండించా లని ఆయన కోరారు. ఇది ఒక్క ‘సాక్షి’ సమస్య కా దని, పాత్రికేయులు, ప్రజాస్వామికవాదులు మే ల్కొనకోకపోతే అందరికీ.. ముఖ్యంగా ప్రజాస్వామ్యానికి పెనుసవాల్‌గా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా పత్రికలు పనిచేస్తున్నాయని బీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు ఉప్పు రాజ్‌కుమార్‌ తెలిపారు. వామపక్ష నాయకులు కల్లేపల్లి అశోక్‌, సీపల్లి రవీందర్‌, మానస్‌ కుమార్‌ మాట్లాడారు. మంథని డివిజన్‌ ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడు మోత్కూరి శ్రీనివాస్‌, జర్నలిస్ట్‌లు కేసీఆర్‌, అడ్డగుంట రాజేందర్‌, కీర్తి రమేశ్‌, మర్రి సతీశ్‌రెడ్డి, లెశెట్టి రాజు, ముంజ శ్రీనివాస్‌, గొర్రె తిరుపతి, అమర్‌, శ్రీనివాస్‌, బాలయ్య, వినయ్‌, కుమార్‌, గాదె బాలయ్య, తాళ్ల రమేశ్‌, గుర్రం వంశీ, శ్రీనివాస్‌, ప్రవీణ్‌రెడ్డి, ఆరెల్లి మల్లేశ్‌, ఎర్రోజు వేణుగోపాల్‌, బెజ్జంకి నరేశ్‌, కల్వ రమేశ్‌, ముద్దసా ని సమ్మయ్య, ఆరుకుటి మల్లేశ్‌యాదవ్‌, కొయ్యాడ తిరుపతి, మొగిలి, కత్తెర్ల చందర్‌, మేకల సంతోష్‌, వెంకటేశ్‌, మరుపాక అంజయ్య, సంకే రాజు, తోట సతీశ్‌, చందర్‌, ప్రసాద్‌, దొమ్మటి రాజేశ్‌, నల్లాపు తిరుపతి, తిరుమల సురేశ్‌, నాగపూర్‌ తిరుపతి, హరిప్రసాద్‌, మామిడాల కుమార్‌, జంగ సంపత్‌యాదవ్‌, బీఆర్‌ఎస్‌ నేతలు పెంచాల శ్రీధర్‌, బొడ్డుపల్లి రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

పత్రికా స్వేచ్ఛను హరిస్తారా?1
1/1

పత్రికా స్వేచ్ఛను హరిస్తారా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement