రైల్వేస్టేషన్‌లో తనిఖీలు | - | Sakshi
Sakshi News home page

రైల్వేస్టేషన్‌లో తనిఖీలు

Oct 18 2025 6:59 AM | Updated on Oct 18 2025 6:59 AM

రైల్వ

రైల్వేస్టేషన్‌లో తనిఖీలు

రామగుండం: స్థానిక రైల్వేస్టేషన్‌లో శుక్రవా రం రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌(ఆర్‌పీఎఫ్‌), ప్ర భుత్వ రైల్వే పోలీస్‌ (జీఆర్పీ), సివిల్‌ పోలీస్‌ బలగాలు కార్డెన్‌ సెర్చ్‌ నిర్వహించాయి. ప్ర యాణికుల బ్యాగులు, వెయిటింగ్‌ రూమ్స్‌ లో తనిఖీ చేశారు. అనుమానితుల నుంచి వి వరాలు సేకరించారు. సోదాలతో ఏం జరుగుతుందోనని ప్రయాణికులు ఉత్కంఠకు గురయ్యారు. ఆర్‌పీఎఫ్‌ సీఐ, ఎస్సైలు లింగమ య్య, నాగరాజు, జీఆర్పీ ఇన్‌చార్జి తిరుపతి, సివిల్‌ సీఐ, ఎస్సైలు ప్రవీణ్‌కుమార్‌, సంధ్యా రాణి, వెంకటస్వామి తదితరులు ఉన్నారు.

వాలీబాల్‌ పోటీలకు ఎంపిక

ధర్మారం(ధర్మపురి): ఉమ్మడి జిల్లా ఎస్‌జీఎ ఫ్‌ అండర్‌ – 19 వాలీబాల్‌ పోటీల్లో స్థానిక మోడల్‌ స్కూల్‌ విద్యార్థులు ద్వితీయ స్థానం సాధించినట్లు వ్యాయామ ఉపాధ్యాయుడు బైకని కొమురయ్య తెలిపారు. ప్రతిభ చూపి న బి.పూజ, జి.పూజ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు వివరించారు. విద్యార్థులను ప్రి న్సిపాల్‌ రాజ్‌కుమార్‌, వ్యాయామ ఉపాధ్యాయుడు ఎం.సంజీవరావు అభినందించారు.

బయోమైనింగ్‌కు ఏర్పాట్లు

పెద్దపల్లి: సుల్తానాబాద్‌ మార్కండేయకాలనీ డంపింగ్‌ యార్డులో బయోమైనింగ్‌కు ఏర్పా ట్లు పూర్తిచేయాలని మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ జాయింట్‌ డైరెక్టర్‌ సంధ్య ఆదేశించారు. సు ల్తానాబాద్‌లోని డంపింగ్‌యార్డ్‌ను శుక్రవా రం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఏజెన్సీ సంస్థ సాగర్‌ మోటార్స్‌ లిమిటెడ్‌ పనులు వేగవంతం చేసేలా చర్యలు తీసుకోవాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. మున్సిపల్‌ కమిషన ర్‌ రమేశ్‌, మేనేజర్‌ అలీమొద్దీన్‌, ఏఈ రాజ్‌కుమార్‌, ఇన్‌చార్జి శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ రమేశ్‌, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

నేడు వెయ్యి బైక్‌లతో ర్యాలీ

పెద్దపల్లిరూరల్‌: బీసీ రిజర్వేషన్ల సాధనకోసం శనివారం చేపట్టిన బంద్‌ సందర్భంగా జేఏసీ ఆధ్వర్యంలో వెయ్యి బైక్‌లతో ర్యాలీ నిర్వహించనున్నట్లు బీసీ సంఘాల నాయకులు ప్రకటించారు. స్థానిక ఆర్యవైశ్యభవన్‌లో శుక్రవా రం తాడూరి శ్రీమన్నారాయణ అధ్యక్షతన జ రిగిన సమావేశంలో నాయకులు మాట్లాడా రు. స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ మైదానంలో ర్యాలీ ప్రారంభమవుతుందని అన్నా రు. చేతి ధర్మయ్య, కొలిపాక నర్సయ్య, మ నోజ్‌గౌడ్‌, శంకర్‌, సదాశివ్‌, పర్వతాలు, ఐల య్య, ఉప్పు రాజ్‌కుమార్‌, శ్రీనివాస్‌, సతీశ్‌, సదానందం, పూర్ణచారి, రంగు శ్రీనివాస్‌ రామ్మూర్తి, భూమేశ్‌ తదితరులు ఉన్నారు.

లక్ష్యం నిర్దేశించుకోవాలి

పెద్దపల్లి: విద్యార్థులు లక్ష్యం నిర్దేశించుకొని ముందుకు సాగాలని డీవైఎస్‌వో సురేశ్‌, ఎస్జీఎఫ్‌ జిల్లా కార్యదర్శి లక్ష్మణ్‌ సూచించారు. సు ల్తానాబాద్‌లో శుక్రవారం జిల్లాస్థాయి టేబుల్‌ టెన్నిస్‌ పోటీలను వారు ప్రారంభించి మాట్లా డారు. ఎంఈవో రాజయ్య, ప్రతినిధులు దాసరి రమేశ్‌, మాటేటి సంజీవ్‌ కుమార్‌, కృష్ణప్రియ, ప్రణయ్‌, వెంకటేశ్‌, సత్యం, శివ, స్వప్న, సతీశ్‌ తదితరులు పాల్గొన్నారు.

పోషక విలువలపై అవగాహన

రామగిరి(మంథని): సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ, రామగిరి ఖిల్లా కృషి విజ్ఞాన్‌ కేంద్రం ఆధ్వర్యంలో కిచెన్‌ గార్డెన్‌ – సాగు పద్ధతులు, పో షక విలువలు అంశంపై అంగన్‌వాడీ టీచర్ల కు శుక్రవారం శిక్షణ ఇచ్చారు. కేవీకే శాస్త్రవేత్త శ్రీనివాస్‌ మాట్లాడుతూ, జిల్లాలోని 15 అంగన్‌వాడీ కేంద్రాలను కేవీకే దత్తత తీసుకుని పోషణ వనాలుగా అభివృద్ధి చేస్తుందన్నారు. శాస్త్రవేత్తలు వెంకన్న, భాస్కర్‌రావు ఉన్నారు.

రైల్వేస్టేషన్‌లో తనిఖీలు 1
1/3

రైల్వేస్టేషన్‌లో తనిఖీలు

రైల్వేస్టేషన్‌లో తనిఖీలు 2
2/3

రైల్వేస్టేషన్‌లో తనిఖీలు

రైల్వేస్టేషన్‌లో తనిఖీలు 3
3/3

రైల్వేస్టేషన్‌లో తనిఖీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement