జర్నలిస్టుల స్వేచ్ఛపై ఆంధ్రప్రదేశ్‌లోని టీడీపీ కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. పత్రికా స్వేచ్ఛను హరిస్తూ, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది. ప్రజా సమస్యలపై గళమెత్తిన ‘సాక్షి’ ఎడిటర్ ధనంజయరెడ్డితో పాటుగా విలేకరులపై కూటమి సర్కారు అక్రమ కేసులు బనాయిస్తూనే ఉంది. సాక్షి కార్యాలయాల్లో పోలీసులు హల్‌చల్ చేయడంపై రాజకీయ పార్టీలు, సామాన్య ప్రజలు ధ్వజమెత్తుతున్నారు.
కక్షపూరిత చర్య
ప్రజాస్వామ్య పద్ధతిలో పోలీసులు వ్యవహరించాలి. పత్రికా స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. ఇది ముమ్మాటికి కక్షపూరిత చర్యే. ప్రతీ అంశంపై ప్రజలను చైతన్యవంతం చేయడమే మీడియా ఉద్దేశం. ఏపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతున్నారనే అక్కసుతో కేసులు నమోదు చేయడం సరికాదు.
– మిర్యాల రాజిరెడ్డి,
టీబీజీకేఎస్ అధ్యక్షుడు
కేంద్రం స్పందించాలి
మూడు రోజులుగా ఏపీ ప్రభుత్వం సాక్షి ఎడిటర్, పాత్రికేయులపై కేసులు నమోదు చేసి బెదిరింపులకు దిగడం సరికాదు. సోదాలు నిర్వహించడం, వార్త సోర్స్‌ను అడగడం రాజ్యాంగ విరుద్ధం. ఈవిషయంలో కేంద్ర ప్రభుత్వం స్పందించాలి. పత్రికాస్వేచ్ఛను కాపాడాలి. అన్యాయాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు నమోదు చేయడం సిగ్గు చేటు.
– యాదగిరి సత్తయ్య, బీఎంఎస్ అధ్యక్షుడు
పత్రికలపై కక్షసాధింపు
ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలిచే పత్రికలపై కక్షసాధింపు సరికాదు. వైఫల్యాలను ఎత్తిచూపే పత్రికలపై రాజకీయ కక్షలు తగవు. ప్రసార మాధ్యమాల గొంతు వినిపించే హక్కును కాలరాయవద్దు. జర్నలిస్టులపై అక్రమ కేసులు పెట్టడం అప్రజాస్వామికం.
– గంగుల కమలాకర్, కరీంనగర్ ఎమ్మెల్యే
పత్రికా స్వేచ్ఛను హరించడమే
పత్రికలు, ప్రసారమాద్యమాల్లో ఏవైనా వార్తలు ప్రచురించినప్పుడు, వారి మనోభావాలు దెబ్బతిన్నాయని బావిస్తే న్యాయపోరాటం చేయాలి. ఇలా బెదిరింపు ధోరణిలో పత్రికా స్వేచ్ఛను హరించివేయడం సరికాదు. – పంజాల శ్రీనివాస్,
సీపీఐ జిల్లా కార్యదర్శి
ఎన్నాళ్లీ అణచివేత
ఎన్నాళ్లీ అణచివేత
ఎన్నాళ్లీ అణచివేత
ఎన్నాళ్లీ అణచివేత